చంద్రబాబు చేతికి ఉంగరం పెట్టుకున్నారని.. అది మహారాజ యోగానికి సంబంధించినందని పిచ్చి పిచ్చి కథనాలు రాసి టీవీ9 పరువు పోగొట్టుకుంది. సోషల్ మీడియలో ఆ చానల్ తీరుపై మరోసారి రచ్చ ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో ఆ చానల్ వార్తలను నమ్మడానికి జనం సంకోచించే పరిస్థితి. అందుకే రేటింగ్‌లు ఎప్పటికప్పుడు పడిపోతున్నాయి. తాజాగా చంద్రబాబు ఉంగరం గురించి అదే తరహాలో రాసి ట్రోలింగ్‌కు గురవుతోంది.
చంద్రబాబు చాలా రోజులుగా ఉంగరం పెట్టుకుంటున్నారు. ఆ విషయం టీడీపీ నేతలకు తెలుసు. అది ఉంగరం కాదని ఫిట్నెస్ ట్రాకరని కూడా తెలుసు. కోరా కంపెనీకి చెందిన ఫిట్నెస్ ట్రాకర్ అది. అయితే టీవీ9కి మదనపల్లెలోని కనిపించింది. అందుకే కథనం వండేశారు. అది అసలు ఏంటి.. అని తెలుసుకునే ప్రయత్నం కూడా టీవీ9 చేయలేదు. కనీసం జర్నలిజం ప్రమాణాలు పాటించలేదు. చంద్రబాబు చెప్పిన తర్వాతైనా కవర్ చేయాలి. కానీ అలా చేయలేదు. తమ పైత్యం తమదే అన్నట్లుగా రెచ్చిపోయింది.
విజయసాయిరెడ్డి ఈ ఉంగరం గురించి మీడియా సమావేశంలో వివరించిన తర్వాత విజయసాయిరెడ్డి ఎప్పట్లాగే తన ట్విట్టర్లో నోటి విరేచనాలు చేసుకున్నారు. ఆ విజయసాయిరెడ్డికి.. ఈ టీవీ9కి పెద్దగా తేడా లేదని టీడీపీ నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు. కవరేజీ ఇవ్వకపోతే పోయారు కానీ తమ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే మాత్రం తగిన శాస్తి అనుభవిస్తారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆ వార్తను ప్రజెంట్ చేసిన యాంకర్ దేవీ నాగవల్లిపై ట్రోలింగ్ చేస్తున్నారు. తప్పు చేయడం వేరు.. తప్పు అని తేలిన తర్వాత వివరణ ఇవ్వడం సహజంగా చేయాల్సిన విషయం. ఇక్కడ టీవీ9కి ఆ సంస్కారం లేకుండా పోయింది.