సర్దార్ గబ్బర్ సింగ్ తరవాత పవన్ కల్యాణ్.. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకొన్నాడు. షూటింగ్‌కి వెళ్తుందనగా.. ఈ ప్రాజెక్టు నుంచి సూర్య అనూహ్యంగా తప్పుకొన్నాడు. ఆ వెంటనే డాలీ వచ్చి చేరాడు. అయినా ఎంతకీ ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడం లేదు. దాంతో డాలీకీ -పవన్‌కీ మధ్య గ్యాప్ వచ్చేసిందని , ఈసినిమా ఆగిపోయిందనిచెప్పుకొన్నారు. డాలీని పక్కన పెట్టి పవన్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడన్న గుసగుసలు వినిపించాయి. అయితే.. పవన్ కల్యాణ్ సన్నిహితులు మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తున్నారు.
”ఇటీవల పవన్ పై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలు. పవన్ – డాలీ సినిమా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది” అని క్లారిటీ ఇచ్చారు. అయితే సూర్య ఆల్రెడీ తయారు చేసిన స్క్రిప్టుతో కాకుండా… డాలీ కొత్త స్క్రిప్టు తయారు చేస్తున్నట్టు వినికిడి. అందుకోసమే.. షూటింగ్ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.