తెలుగు సినిమా షూటింగులు ఏవీ జరగడం లేదు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని చినబాబు నిర్మిస్తున్న సినిమా, రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా, నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా షూటింగులు మాత్రమే జరుగుతున్నాయి. వేతనాలు పెంచాలని, హాఫ్ కాల్షీట్ తీసేయాలని ‘తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్’ ఈ నెల 21 నుంచి సమ్మెకు దిగింది. దాంతో షూటింగులు ఆగిపోయాయి. లైట్మన్లు ఎవరూ షూటింగులకు రావడం లేదు. వీళ్లను పక్కనపెట్టి బాంబే నుంచి పిలిపించి షూటింగులు చేస్తే సెట్స్ దగ్గరకు వెళ్లి అడ్డుకుందామనే ఆలోచనలో వున్నారు. ఇవన్నీ తెలిసిన నిర్మాతలు షూటింగులను తాత్కాలికంగా వాయిదా వేశారు. కాని ఎన్టీఆర్, రామ్‌చరణ్ సినిమాల షూటింగులు మాత్రం వాయిదా పడలేదు. ఆగలేదు. కారణం ఒక్కటే… ఈ రెండిటి షూటింగులు హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. ఫిలిం సిటీ లోపలికి అనుమతి లేనిదే ఎవ్వర్నీ రానివ్వరు. తెలుగు లైట్మన్లు సమ్మె చేస్తుండడంతో బాంబే నుంచి పిలిపించి షూటింగ్ చేస్తున్నారు. దాంతో ఇక్కడి లైట్ మన్లు ఫిలింసిటీ లోపలికి వెళ్ళి నిరసన తెలిపే అవకాశాలు లేకపోవడంతో ఎలాంటి గొడవలు లేకుండా షూటింగులు సజావుగా సాగుతున్నాయి. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పంజాబ్ దగ్గర షూటంగ్ జరుగుతోంది. ఆ షూటింగులో తెలుగు లైట్ మన్లు వర్క్ చేస్తున్నారు. వాళ్ళను యూనియన్ వెనక్కి పిలిపించే పనిలో వుంటదట.