రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆ గ్రామల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటించింది. ఆ గ్రామాలు మాత్రమే కాదు.. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు నిర్వహించడం లేదు. రాజధాని గ్రామాల్లో గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించవద్దని.. ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది… చాలా రోజుల క్రితమే ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రభుత్వం.. అమరావతిని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలనుకుంది. అలాగే యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి పురపాలికలో , పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలనుకుంది. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా.. కోర్టుల్లో స్టే వచ్చింది. దీంతో అవి గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి. వాటిలో ఎన్నికలు నిర్వహిస్తారేమోనని అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆ స్టేనే కారణంగా చూపి.. మొత్తంగా.. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలతో పాటు.. రాజధాని గ్రామాలన్నింటిలోనూ స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. రాజధాని గ్రామాల ప్రజలు… మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధులెవరూ తిరగలేకపోతున్నారు. అందుకే మొదటి నుంచి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అక్కడ ఎన్నికలు నిర్వహించకూడదన్న అభిప్రాయంతో ఉందని చెబుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ ఎన్నికలు జరగడం లేదనే క్లారిటీ వచ్చింది. మొత్తానికి ప్రభుత్వం… అన్నీ పారదర్శకంగా చేస్తామని మాటల్లో చెబుతోంది కానీ.. ఎన్నికల విషయంలో .. అసలు ఎక్కడ ఎన్నికలు జరుగుతాయి.. ఎక్కడ జరగవన్న విషయంలో… కనీస పారదర్శకత కూడా పాటించలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.