తమిళనాడు ప్రభుత్వం కూడా సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది. ఈడీ అధికారులు తమ మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేయడంతో.. సీబీఐ అధికారులు కూడా విరుచుకుపడే అవకాశం ఉందన్న భావనతో రాత్రికి రాత్రే.. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట… ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వాలన్నీ.. సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేశాయి. ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే .. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటూ సీబీఐని అనుమతిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ … కొన్ని సీట్లు అయినా పొందాలన్న లక్ష్యంతో ఉంది. తమిళనాడుల విపక్షాల పరిస్థితి ఘోరంగా ఉంది. అందుకే కొత్తగా దర్యాప్తు సంస్థలతో రాజకీయం ప్రారంభించారు. అక్కడ బీజేపీ చీఫ్ గా .,. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఉన్నారు. ఆయన తన పోలీస్ బ్రెయిన్ అంతా ఉపయోగించి ఓ జాబితా తయారు చేసి బహిరంగంగానే ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం దాడులు జరుగుతున్నాయి. బహుశా ఆయన ఉద్దేశం.. జాబితాలోని మిగతా వారు బీజేపీలో చేరానే గుసగుసలు కావొచ్చని అంటున్నారు.
దర్యాప్తు సంస్థల విశ్వసనీయత మొదటి నుంచి ప్రశ్నార్థకంగానే మారింది. ఇష్టం వచ్చినట్లుదా.. సెలక్టివ్ గా కొంత మందిని టార్గెట్ చేయడం.. మరికొంత మందిని వదిలి వేయడం వంటివి చేస్తున్నాయి. విచారణలో ఉన్న కేసుల గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఇలాంటివి.. దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. కానీ కేంద్రం వాటితో ఆటలాడుతూనే ఉంది.