ఎలాన్ మస్క్ ఇండియాలోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇండియాలో విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో టెస్లాను చైనా ఫ్యాక్టరీ నుంచి తెచ్చి అమ్మాలనుకున్నారు కానీ ఉత్పత్తి చేస్తే మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇస్తామని లేకపోతే పాలసీ ప్రకారం పన్నులు కట్టాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ తన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ ను మాత్రం అందించాడనికి ఏర్పాట్లు చేసుకున్నారు.
కానీ ఇప్పుడు అది కూడా ఇబ్బందుల్లో పడనుంది. ఇటీవల భారత శివార్లలో భారత వ్యతిరేకత చర్యలకు పాల్పడేవారికి స్టార్ లింక్ పరికరాలు ఉపయోగపడుతున్నాయి. కొంత మంది వద్ద అవి లభించాయి. వాటిని ఎవరు కొనుగోలు చేశారో చెప్పాలని అడిగితే స్టార్ లింక్ చెప్పడం లేదు. తమ వినియోగదారుల ప్రైవసీ బయట పెట్టబోమని అంటున్నారు. ఉగ్రవాదుల చేతికి స్టార్ లింక్ పరికరాలు ఇచ్చి.. వారి వివరాలు చెప్పేదిలేదంటే ఎలా అని.. భారత్ కు కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయని పాటించాల్సిందేనని అంటున్నారు. కానీ ఎలాన్ మస్క్ దానికి సిద్ధంగా లేరు.
ఈ కారణగా స్టార్ లింక్ ఇండియా ఎంట్రీ ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ తన విధానాల్లో రాజీ పడరు. ఇండియా అంత తేలికగా ఆ ఇంటర్నెట్ తమ దేశంపై దండెత్తడానికి ఉపయోగపడితే అంగీకరించదు. ఈ వ్యవహారంతో జియోకు ముప్పుగా మారుతుందని అంచనావేసిన స్టార్ లింక్ .. ఎంట్రీ ఆగిపోయినట్లే అనుకోవచ్చంటున్నారు. ఎలాంటి వైర్లతో సంబంధం లేకుండా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించడమే స్టార్ లింక్ స్పెషాలిటీ.