గుడివాడలో శరత్ ధియేటర్ అంటే నాని అడ్డా అని అందరికీ తెలుసు. అక్కడ ఆయన ముఠా ఎప్పుడూ ఉంటుంది. ఆ రోడ్ గుండా టీడీపీ వాళ్లు ర్యాలీలు చేస్తే అందలో నుంచి రాళ్లు వచ్చి పడతాయి. కర్రలతో వచ్చి దాడి చేసేవాళ్లు. అలాంటి అడ్డాలో ఇప్పుడు కొడాలి నానికి ఎంట్రీ లేదు. ఆయనను పూర్తిగా గెంటేశారు. నిజానికి ఆ ధియేటర్ కొడాలి నాని సొంతదని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటూ ఉంటారు. కనీ అది నిజం కాదు.
గుడివాడలో శరత్ ధియేటర్ యలవర్తి శ్రీనివాసరావు అనే లీడర్ ది. ఆయన ఒకప్పుడు కొడాలి నాని అనుచరుడు. మున్సిపల్ చైర్మన్ గా కూడా చేశారు. కానీ తర్వాత టీడీపీలో చేరారు. అయినా ధియేటర్ మాత్రం కొడాలి నాని అధీనంలోనే ఉంది. ఓ రకంగా కబ్జా చేశారు. అధికారం నాని చేతుల్లో ఉండటంతో యలవర్తి కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే ఎప్పుడు అధికారం పోయిందో అప్పుడు శరత్ ధియేటర్ ఆయన చేతుల్లోకి వచ్చింది.
ఇప్పుడు తమ ధియేటర్ తమ చేతుల్లోకి రావడంతో టీడీపీ నాయకులకు అందులోనే టీ పార్టీ ఇచ్చారు యలవర్తి శ్రీనివాసరావు. ఎమ్మెల్యే రాము, టీడీపీ నేతలు టీ పార్టీకి హాజరయ్యారు. హాజరయ్యారు. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు.. కొడాలి నాని ఫోటోలను పూర్తిగా తొలగించారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని హక్కు దారులకు అప్పగించామని .. ఇలా ఎన్నో ఆస్తులు ప్రజలకు తిరిగి ఇస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక మంది ఫిర్యాదులతో తమ వద్దకు వస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెబుతున్నారు.
మొత్తంగా కొడాలి నాని కి శరత్ ధియేటర్ తో రుణం తీరిపోయింది. ఆయన కబ్జా నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ ఎక్కడ నుంచి రాజకీయం చేశారో అక్కడ నిలువ నీడ లేకుండా పోయింది.