వైసీపీని ధిక్కరిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీలో చేర్చుకునే చాన్స్ లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆనం విషయంలో కాస్త పాజిటివ్ గా ఉన్నా.. కోటంరెడ్డిని మాత్రం స్థానిక నాయకులు అంగీకరించే అవకాశం లేదని అంటున్నారు. కోటంరెడ్డి తనపై సొంతపార్టీలో కుట్ర చేస్తున్నారని బయటపడ్డారు కానీ ఆయనది అత్యంత క్రిమినల్ మైండ్ సెట్. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ఓ టీడీపీ కార్యకర్తను పట్టపగలు హత్య చేయించబోయారు.. ఆధారాలతో సహా దొరికినా .. పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన ఓ మహిళా అధికారి ఇంట్లో చేసిన అలజడి అంతా ఇంతా కాదు. ఇలాంటి నిర్వాకాలు కోటంరెడ్డి ఎన్నో చేశారు.
ఆయనపై టీడీపీ నేతల్లో ఏ మాత్రం పాజిటివిటీ లేదు. ఆయనను పార్టీలోకి తీసుకోవద్దన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. అసలు కోటంరెడ్డి ఇప్పటి వరకూ టీడీపీతో టచ్ లోకి రాలేదని ఆయన ఇతర పార్టీల వారితో కలిసి లాబీయింగ్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల వెంకయ్యనాయుడును కలిశారు. సుజనా చౌదరితో టచ్లో ఉన్నారని అంటున్నారు. బహుశా ఆయన బీజేపీలోకి వెళ్లవచ్చని చెబుతున్నారు.
మరో వైపు కోటంరెడ్డి వ్యవహారంతో ఆయనకు చెక్ పెట్టడానికి ఆయన సోదరుడ్ని నెల్లూరు రూరల్ ఇంచార్జ్ గా ప్రకటించాలని వైసీపీ హైకమాండ్ డిసైడయినట్లుగా తెలుస్తోంది. కోటంరెడ్డి రూరల్ నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ దశలో పార్టీ మారడం ఒక్కటే ఆయన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. వైసీపీలోనే ఉన్నా కూడా 2024లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువ. అందుకే కోటంరెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే ఏ పార్టీలోకి అన్నది మాత్రం సస్పెన్స్.