జగన్ మోహన్ రెడ్డి ఇంటికి అరకిలోమీటర్ దూరం నుంచే సెక్యూరిటీ ఉంటుంది. కేవలం అనుమతి ఉన్న వారికే అక్కడ్నుంచి ముందుకెళ్లగలరు. అయిత అది జూన్ నాలుగో తేదీ వరకే. ఇప్పుడు ఆయన ఇంటి ముందు పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు. కానీ ఆయన ఇంట్లోకి మాత్రం.. ఎవరికీ అనుమతి ఉండదు. మీడియాకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు విచిత్రంగా తను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడుతున్నానని మీడియా ప్రతినిధులు రావాలని పిలుపునిచ్చారు. కానీ కెమెరాలు మాత్రం తెచ్చుకోవద్దట.
మీడియా లైవ్ లింక్ షేర్ చేస్తామని.. దాన్నే వాడుకోవాలి కానీ.. సొంతంగా వీడియోలు మాత్రం తీయవద్దని ఈ ఆంక్షలు వేధించారు. పైకి మాత్రం… స్పేస్ లేదని కారణం చెబుతున్నారు. వైసీపీ ఆఫీసు అంటే.. గతంలో తాడేపల్లిలో ఉన్న అద్దాల భవనమో.. ఊరూరా కట్టిన ప్యాలెస్లో కాదు… జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ధనం కోట్లు పెట్టి ముస్తాబు చేసుకున్న క్యాంప్ ఆఫీసే .. ఇప్పుడా పార్టీ ఆఫీసు. సీఎంగా ఉన్నప్పుడు సమీక్షలు చేసిన ప్లేస్లోనే ఇప్పుడు కూర్చుని పార్టీ కోసం పని చేసుకుంటున్నారు.
Read Also :ఛానెల్ ఏర్పాటులో విసారెడ్డి దూకుడు..ఆ వైసీపీ నేతలకు మూడినట్లేనా?
తాడేపల్లిలో ఉన్నదంతా ప్రభుత్వ సామాగ్రినే. ఆయన వైభోగాన్ని ఎక్కడ షూట్ చేసి జనం ముందు పెడతారోనన్న భయంతోనే కెమెరాలను అనుమతించడం లేదు. అత్యంత లగ్జరీగా ఉండేలా.. రూ. కోట్లు పెట్టి సొంత బంధువులతో చేయించుకున్న డిజైన్స్ ఇల్లు.. క్యాంప్ ఆఫీస్ ఉంటుంది.