కేంద్ర ప్రభుత్వం ఇక లాక్‌డౌన్‌ను పొడిగించే ఉద్దేశంలో లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పాటు.. అన్ని రకాల వ్యాపారాలు గతంలో జరిగేలా పూర్తిగా ఆంక్షలు సడలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ దుకాణాల వరకూ అనుమతి ఇచ్చారు. పద్దెనిమిదో తేదీ నుంచి సినిమా ధియేటర్లు, మాల్స్‌ను కూడా ప్రారంభించుకునేలా వెసులుబాటు ఇవ్వనున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చ్ 25 నుంచి సినిమా హాల్స్, మాల్స్ మూతపడ్డాయి. అప్పటి నుంచి జనసమూహంగా ఎక్కువగా గుమిగూడే ఏరియాల్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా వైరస్ తీవ్రతను వీలైనంతగా తగ్గించగలిగామని.. విస్తరించే ప్రాంతాలను గుర్తించి.. ఆ మేరకు కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేశారు. వాటిలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని నిర్ధారించుకున్న గ్రీన్ జోన్లలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే.. మొదట్లో.. కొన్ని ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో షోలు ప్రదర్శించడం.. పూర్తి స్థాయిలో టిక్కెట్లు అమ్మకపోవడం.. సాయంత్రం ఏడు తర్వాత మూసివేయాలనే నిబంధనలు కొన్ని మొదట్లో పెట్టే అవకాశం ఉంది. అలాగే మాల్స్‌లోనూ .. పరిమిత ఎంట్రీకి అవకాశం ఇవ్వనున్నారు. హాల్, మాల్‌లోకి వచ్చే ప్రతీ ఒక్కరికి ధర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటివి తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలోనూ.. కేంద్రం సీరియస్‌గా పరిశీలన చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు తొలగించి.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలు ప్రారంభించనున్నారు. అయితే.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వారికే ప్రయాణ చాన్స్ ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా పాస్‌లు ఇస్తారు. వాటి ద్వారా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ నెలాఖరుతో.. దేశంలో సాధారణ జనజీవనం వచ్చే అవకాశం ఉంది. కరోనాతో కలిసి జీవించడం ఇండియన్స్ అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి.