రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో చంద్రబాబు సర్కార్ కొండవీటి ఎత్తిపోతల పధకాన్ని రూ. 237 కోట్లతో పూర్తి చేసి..అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఆ ఎత్తిపోతలను ఉపయోగించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఎగువన కురిసిన వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు ముంపు వచ్చే అవకాశం ఉండటంతో ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేశారు. నీటిని కృష్ణానదిలోకి పంప్ చేయడం ప్రారంభించారు. పొలాల్లో నిలబడిన నీరు.. ఎత్తిపోతల ద్వారా కృష్ణాలోకి పంపేస్తున్నారు.
దీంతో 20 గ్రామాల రైతులు వేల ఎకరాల పంటపొలాలను వరద ముంపు నుంచి కాపాడగలిగారు. రాజధాని పేరుతో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల మూలంగా తమకు శాశ్వత పరిష్కారం లభించిందని రైతులు సంతోష పడుతున్నారు. రాజధాని కూడా మునుగుతుందనే ప్రభుత్వ అసత్య వాదన తేలిపోయిందని రైతులు చెబుతున్నారు. రాజధాని ముంపు అనేది ప్రభుత్వానికి అతి పెద్ద ఆయుధం. గత ఏడాది వచ్చిన వరదలను బిగబట్టి ఒక్క సారిగా నీరు వదిలినా పెద్దగా ముపు రాలేదు.
ఈ సారి స్వయంగా కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో వర్షాలు పడినా ముంపు రాలేదు. అయినా .. చంద్రబాబు ఇంటికి నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాలని రాజకీయ నేతలు విమర్శలు కూడా ప్రారంభించారు. మునిగిపోతున్న లంక గ్రామాల ప్రజల పునరావాసం విషయంలో మాత్రం.. పెద్దగా చొరవ చూపించడం లేదు.