తెలంగాణలో గత ఆరేళ్లలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో.. ఫ్లోరైడ్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించినట్లయింది. తెలంగాణ ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి లభించింది. తాగే నీళ్లలో ఫ్లోరైడ్ ఉండటంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడటం దశాబ్దాలుగా వస్తోంది. ఇప్పుడు .. ఆ పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేసింది. ఫ్లోరైడ్ బాధితులు అత్యంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. శరీరాలు ఎదగవు. కాళ్లు, చేతులు సత్తువ లేకుండా అయిపోతాయి. వారి బాధ వర్ణనాతీరం. ఇలాంటి వారి లక్షల్లో ఉండేవారు. చాలా కాలం నుంచి ప్రభుత్వాలు.. ఈ ఫ్లోరైడ్ విషయంలో… అనేక చర్యలు తీసుకున్నాయి. వాటన్నింటి కంటే మిన్నగా.. తెలంగాణ సర్కార్.. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేసి.. సమస్యను పరిష్కరించే దిశగా అడుగు ముందుకేసింది.
2014 డిసెంబర్లో మిషన్ భగీరథ పనులు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికి 1700 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. అయితే అంతకు ముందు చేసిన ప్రభుత్వాల కృషి కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంటే.. అంతకు ముందు చేసిన చర్యలు కూడా సత్ఫలితాలు ఇచ్చినట్లుగానే భావించాలి. అయితే కేసులు లేకపోయినప్పటికీ ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలున్నాయి. ఈ విషయంలో ప్రస్తుత తెలంగాణ సర్కార్ గొప్ప విజయం సాధించింది.
అప్పట్లో కేంద్రం విడుదలచేసిన జాబితాలో 2015లో తెలంగాణలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండగా ఇప్పుడు అసలే లేవు. మిషన్ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఆ సంఖ్య ఇప్పుడు సున్నాకు చేరిందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 111 గ్రామాల్లో ఈ సమస్య ఉంది. చాలా చోట్ల ఫ్లోరైడ్ కేసుల వెలుగు చూస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాటలే చెబుతున్నాయి కానీ.. వారికి సురక్షిత తాగు నీరు అందించి.. బయట పడేసే ప్రయత్నం మాత్రం చేయలేదు.