ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సూచనల్ని షర్మిల తిరస్కరించినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ బయటకు రాని ఆమె ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రమే రాజకీయాలు చేస్తానని షర్మిల చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అవసరం లేదని కాంగ్రెస్ హైకమాండ్ మిన్నకుండిపోయింది. ఆాంధ్రజ్యోతి ఆర్కే లాంటి వాళ్లు ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలనే సలహాలను మీడియా ముఖంగా పంపినా ఆమె మాత్రం మనసు మార్చుకోలేదు.
కాంగ్రెస్ లక్ష్యం ఒకటే..ఏపీలో.. జగన్ రెడ్డి పట్టుకుపోయిన తమ ఓటు బ్యాంక్ ను వెనక్కి రప్పించుకోవడం. వైఎస్ కు ఇచ్చిన అతి చనువు… ఆయన ఇమేజ్ పెంచుకునేందుకు ఇచ్చిన అవకాశంతో… జగన్ రెడ్డి కాంగ్రెస్కు ఏపీలో పాతరేశారు. ఇప్పుడు ఆ వైఎస్ కుమార్తెతోనే తమ ఓటు బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ.. షర్మిల మాత్రం … తనకు బేస్ లేని తెలంగాణలో మాత్రమే రాజకీయాలు చేస్తానంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ లో అలజడి రేపేందుకు వేసిన స్కెచ్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
షర్మిల పార్టీ పెట్టడమే కాదు.. చాలా విషయాల్లో బీఆర్ఎస్ సహకరిస్తోందని.. ఆమెకు హైప్ ఇస్తోందన్న ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ పర్యటనకు వెళ్తే ఎవరూ పట్టించుకునేవారు కానీ.. హౌస్ అరెస్ట్ చేయించడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. ఆమె తెలంగాణలో కేసీఆర్ కోసం జగన్ వదిలిన బాణం అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అన్నతో విబేధాలున్నాయని అందుకే.. తెలంగాణలో పార్టీ అనే ప్రచారం చేశారు. అంతగా విబేధాలుంటే… ఏపీలో రాజకీయం చేస్తే హోరాహోరీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి అండ ఉంటే… ఇంకా ఎందుకు వెనుకాడుతున్నట్లు. ఆమె సొంత రాజకీయాలు చేయడం లేదని.. ఎవరో వదిలిన బాణం అన్న అనుమానాలు అందుకే వస్తున్నాయంటున్నారు.