జగన్ రెడ్డి పాలన లో పులుసు అంతా కారిపోయింది. సంక్షేమ క్యాలెండ్ విడుదల చేసి కూడా నొక్కాల్సిన బటన్ల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా … ఎవరికీ తెలియదులే అని తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలల కిందట నొక్కాల్సిన చేయూత పథకానికి బటన్ ఇప్పటి వరకూ నొక్కలేదు. దాని గురించి ఆలోచించలేదు. లబ్దిదారుల జాబితాను రెడీచేసి మరీ సైలెంట్ గా ఉన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలందరికీ పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి హామీల్లో ప్రకటించారు. తర్వాత మోసం చేశారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏటా పదిహేను వేలు ఇస్తానన్నాడు. అవి కూడా అరకొరగా అనేక వంకలు పెట్టి లబ్దిదారులను తగ్గించారు. ఇప్పుడు అది కూడా ఇవ్వడంలేదు.
చేయూత పథకం కోసం లబ్దిదారులు రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అక్టోబర్లో రైతు భరోసా రెండో విడత విడుదల చేయాల్సి ఉంది. దాని గురించి మాట్లాడటం లేదు. నెలాఖరు రోజు వచ్చినా సప్పుడు లేదు. గతంలో నెలాఖరు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి పన్నుల్లో వాటాల రూపంలో నాలుగు వేల కోట్ల వరకూ వచ్చేది. దాన్నుంచి పథకాలకు ఇచ్చేవారు. గత రెండు నెలల నుంచి ఇలా వాటాలు వస్తున్నా… సరిపోవడం లేదు. బటన్లు నొక్కడం లేదు. ఎన్నికలు వస్తున్నందున బడా కాంట్రాక్టర్లకు పెండింగ్ లేకుండా చెల్లింపులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పథకాల పేరుతో జగన్ రెడ్డి ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. ఇచ్చేది రూపాయి అయితే పది రూపాయలను లాగేసుకుంటున్నారు. ఆ రూపాయి కోసం ప్రజలు ఎదురు చూసేలా చేస్తున్నారు. చివరికి ఎగ్గొట్టినా ఆశ్చర్యం లేదు. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేశారు.. ఇప్పుడు సంక్షేమ క్యాలెండర్ పేరుతోనూ అదే మోసం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. లెక్క చేయడం లేదు. ఎవరైనా ఏమైనా అంటే కేసులు పెడతామన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది.