విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేవలం రూ. .1,682 కోట్లు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు… ఎఫ్‌డీఐలు వచ్చాయి. మొత్తంగా ఇండియాకు వచ్చిన విదేశీల్లో పెట్టుబడుల్లో ఇది అరశాతం కూడా లేదు. 2021-22లో మొత్తం రూ.4,37,188 కోట్ల ఎఫ్‌డీఐలు ఇండియాకు వస్తే ఏపీకి 1682 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణకు రూ.11,965 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు చేసే కర్ణాటక గత ఏడాది ఈ ఎఫ్‌డీఐల విషయంలో చాంపియన్‌గా నిలిచింది. వచ్చిన పెట్టుబడుల్లో 37 శాతం కర్ణాటకకే వెళ్లాయి. తర్వాత మహారాష్ట్ర , గుజరాత్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ ఏడో ప్లేస్లోఉండగా.. ఏపీ టాప్ టెన్‌లో లేకుడా పోయింది. గత ఏడాది వరకు మొత్తం పెట్టుబడుల్లో మొదటిస్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పరిశ్రమలకు.. పెట్టుబడులకు ప్రాధాన్యం తగ్గించారు.
పీపీఏల రద్దు.. ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమలను వెళ్లగొట్టడంతో పెట్టుబడులన్నీ ఆగిోయాయి. 2019 అక్టోబరు నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడి కేవలం రూ.3,796 కోట్లు మాత్రమే. లోకల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఎప్పుడో మానేశారు. విదేశీ పెట్టుబడులూ లారవడం లేదు .దీంతో ఏపీ పారిశ్రామిక రంగం పూర్తిగా కుదలైంది. అయితే ఆర్బీఐ చెప్పే వాస్తవాలు ఇలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం.. రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. రూ. కోట్లు పెట్టి పత్రికా ప్రకటనలు ఇస్తూ ఉంటుంది.