జనసేనకు నిధుల సమస్యను పరిష్కరించేందుకు జనసైనికులు చేయి చేయి కలుపుతున్నారు. పార్టీ పరమైన ఆదేశాలు కానీ సూచనలు కానీ లేకపోయినా స్వచ్చందంగా… తమ ఒక రోజు సంపాదనను పార్టీకి కేటాయించాలన్న ఉద్యమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్.. పుట్టిన రోజు వేడుకలు దగ్గరకు వచ్చాయి. పవన్ బర్త్ డే సందర్భంగా వేడుకలు చేయకుండా ఆ ఖర్చును జనసేనకు విరాళంగా ఇవ్వాలన్న ఓ క్యాపెంయిన్ తో కార్యకర్తలు …. కష్టపడుతున్నారు.
జనసేనకు పవన్ కల్యాణ్ అభిమానులు అండగా ఉంటున్నారు. పార్టీ నడపడం అంటే చిన్న విషయం కాదు. కోట్లు ఖర్చువుతుంది. పవన్ కల్యాణ్ పార్టీ నుంచి ఇంకా ప్రభావ స్థాయిలో ప్రజాప్రతినిధులు రాలేదు. దాంతో కార్పొరేట్ సంస్థలు… విరాళాలు ఇవ్వడం లేదు. పార్టీని సొంతంగా నడుపుకోవాలి. అందు కోసం పవన్ సినిమాలు చేస్తున్నారు. ఎంత చేసినా… పార్టీని నడపడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎన్నికల సమయంలో నిధుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే … జనసైనికులే స్వచ్చందంగా విరాళాలకు రెడీ అవుతున్నారు.
జనసైనికులు అందరూ… తమ ఒక రోజు ఆదాయాన్ని జనసేనకు ఇస్తే… పెద్ద ఎత్తున నిధులు జమ అవుతాయి. ఇప్పటికీ పార్టీ కార్యకర్తలే …. పార్టీకి విరాళాలు అందిస్తున్నారు. వారే అత్యధికంగా పార్టీని నడుపుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారే అండగా ఉండేందుకు ముదంుకు వస్తున్నారు.