సీఐగా ఉద్యోగం చేసుకునే గోరంట్ల మాధవ్ ను రాజకీయాల్లోకి తెచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత ఆయనను నిరుద్యోగిగా మార్చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే బతిమాలుకుని అయినా తన ఉద్యోగం మళ్లీ తాను తెచ్చుకునేవరేమో కానీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత అటు ఆ ఉద్యోగం రాదు.. ఇటు రాజకీయాల్లోనూ ఉండలేని పరిస్థితి.
హిందూపురం ఎంపీ సీటును జగన్ రెడ్డి బీజేపీ నేత బి.శ్రీరాములుకు అమ్మేసుకున్నారు. కనీసం తనకు హిందూపురం అసెంబ్లీ సీటు అయినా కేటాయించాలని కోరినా .. గోరంట్లమాధవ్ ను పట్టించుకోలేదు. జగన్ రెడ్డి కోసం జేసీ బ్రదర్స్ పైనే కాదు.. చంద్రబాబుపైనా కారుకూతలు కూసిన గోరంట్ల మాధవ్.. చివరికి ఎవరికీ కాకుండా పోయారు. ఇప్పుడు ఆయనకు రాజకీయంగా నిలువ నీడ లేదు. ఎందుకంటే… అనంతపురంలో ఆయనకు నియోజకవర్గం అంటూ లేదు. ఏ నియోజకవకర్గంలోనూ ఆయనను అడుగు పెట్టనీయరు. ఆయన సొంత జిల్లా కర్నూలు. అక్కడా పట్టించుకునేవారు ఉండరు.
ఇప్పుడు రాజకీయంగా గోరంట్ల మాధవ్ కు మరో అవకాశం జగన్ కల్పించే చాన్స్ లేదు. చివరికి ఆయన అటూ ఇటూ కాకుండా.. విఫల రాజకీయ నాయకుడిగా మిగిలిపోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మారితే… గతంలో తాను చేసిన పనులకు తగ్గ శిక్షను అనుభవించడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు వైసీపీ కూడా కాపాడటానికి ముందుకు రాదు. ఎందుకంటే మాధవ్ కంటే ఎక్కువ కష్టాలు ఆ పార్టీని చుట్టుముడతాయి మరి