లోకేష్ పాదయాత్ర వినూత్నంగా సాగుతోంది. ప్రతీ రోజూ ఓ సోషల్ కాజ్ ను హైలెట్ చేస్తున్నారు. దేశం మొత్తం గంజాయి సరఫరా చేసే కేంద్రంగా ఎదిగిన ఆంధ్ర పరిస్థితిని కళ్లకు కట్టేలా చేసి ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు గంజా వద్దు బ్రో పేరుతో శుక్రవారం పాదయాత్రను కొనసాగించారు. శుక్రవారం పాదయాత్రకు హీరో బాలకృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు. బాలకృష్ణ, లోకేష్ గంజాయి వద్దు బ్రో రాసి ఉన్నటి షర్ట్స్ ధరించారు..
గంజాయి ఏపీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందని.. గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాని లోకేష్ తెలిపారు. టీడీపీ హయాంలో రూ. 40వేల కోట్లు విలువ చేసే గంజాయిని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసీపీ నాయకులు గంజాయి పంట వేస్తున్నారు. పాదయాత్రలో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయికి బానిస అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తల్లి చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి. అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
అసలు ప్రజలంటే జగన్‌కు ఎలాంటి ప్రేమ లేదని … జనాలపై జగన్‌కు ఉన్నది కక్ష మాత్రమేనని బాలకృష్ణ స్ప్,టం చేశారు. సీఎం జగన్‌ది అదో సైకోతత్వం అని హాట్ కామెంట్స్ చేశారు. తాను సైకాలజీ చదవిలేదని కానీ తనకు మించిన సైకియాట్రిస్ట్ లేడని… జగన్ ను మించిన సైకో లేరన్నారు. పాదయాత్రకు జన సందోహం రోజు రోజుకు పెరుగుతోంది. పెద్ద ఎత్తున హాజరవుతున్న ప్రజలతో కలిసి లోకేష్ ఉత్సాహంగా నడుస్తున్నారు. ఇప్పటికే రెండు నెలలు.. ఎనిమిది వందల కిలోమీటర్లు దాటిపోయింది.