ఫార్ములా ఈ రేసు పేరుతో రూ. 55 కోట్లను విదేశాలకు తరలించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించేందుకు అనుమతి కావాలని గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసి చాలా రోజులు అయింది. మధ్యలో తన మంత్రులతో కలిసి రేవంత్ కూడా ఓ సారి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఏసీబీ అడిగిన పర్మిషన్ మాత్రం ఇంత వరకూ రాలేదు. దాని కోసం ఏసీబీ ఎదురు చూస్తోంది.
ఈ లోపు కేటీఆర్ కాంగ్రెస్ పై బెదిరింపులకు దిగుతున్నారు. అది కూడా బీజేపీని అడ్డం పెట్టుకుని. బీజేపీ కేంద్రమంత్రులను కలిసి కాంగ్రెస్ అవినీతిపై ఫిర్యాదు అంటూ హడావుడి చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు క్లారిటీ వస్తోంది. కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఏమి జరిగిందా అని ఆరా తీస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో రూ. 55 కోట్లను లెక్కాపత్రం లేకుండా తరలించారు. ఇది చాలా సీరియస్ కేసు అవుతుదంది. అది కూడా విదేశాలకు తరలించారు. అంటే అక్రమ నగదు చెలామణి. ఈడీ కేసు కూడా అవుతుంది.
అక్రమంగా నగదు విదేశాలకు అదీ ప్రభుత్వ ఖజానా నుంచి తరలించడం అంటే చిన్న విషయం కాదు. ఈ కేసులో ఓ సారి ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తే కేటీఆర్ నిండా మునిగిపోతారు. అందుకే ఆయన కంగారు పడుతున్నారని బీజేపీ నేతలతో భేటీల కోసం పరుగులు పెట్టారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే బీఆర్ఎస్,బీజేపీ బంధాన్ని ఎక్స్ పోజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.