ఈనెల 6న గోవాలో చైతూ – సమంతల పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి 150 మంది అతిథులు వస్తారని, పది కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగార్జున స్పందించారు. కొద్ది సేపటి క్రితం అన్నపూర్ణ స్టూడియోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ”పెళ్లి వీలైనంత సింపుల్‌గా చేయాలని సమంత, చైతూలు భావించారు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేశాం. గోవాలో 6న హిందూ సంప్రదాయం ప్రకారం, 7న క్రైస్తవ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగబోతోంది. ఓ రోజు పంచెకట్టులో, మరో రోజు సూటులో కనిపిస్తాడు చైతూ. ఈ పెళ్లికి అతిథుల్ని ఆహ్వానించ లేదు.కేవలం మా కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఓ వేడుకలా ఉండబోతోంది. మా కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, సమంత కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాలుపంచుకొంటారు. హైదరాబాద్‌లో రిసెప్షన్‌ని మాత్రం గ్రాండ్ గా చేస్తాం. అయితే ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు” అన్నారు నాగార్జున. ”పిల్లల్ని చూసుకోండి.. పెళ్లి చేసి పెడతా అని నా పిల్లలకు ముందే చెప్పా. వాళ్ల ఇష్టప్రకారమే పెళ్లిళ్లు చేస్తా. పెళ్లయ్యాక హనీమూన్ ప్లాన్స్ ఏమీ లేవు. సమంత, చైతూ చేతిలో సినిమాలున్నాయి. వాళ్ల వాళ్ల బిజీలో వాళ్లుంటారు” అని క్లారిటీ ఇచ్చాడు.