ఫ్లెక్సీలు కట్టడం లేదు.. సంబరాలు చేయడం లేదు.. చివరికి సాక్షి పత్రిలో ప్రకటనలు కూడా ఇవ్వ లేదు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి మూడేళ్ల అయిన సందర్భంగా ఎక్కడా ఆ ఉత్సాహం వైసీపీలో కనిపించడం లేదు. స్వయంగా సీఎం జగనే దేశంలో లేరు. దీంతో ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి.. మ మ అనిపిస్తున్నారు. మామూలుగా అయితే యానివర్సిరీలు వస్తే క్యాడర్లో ఉండే జోష్ అంతా ఇంతా కాదు.
పైగా ముంద్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భం… ప్రతిపక్షం దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్న తీరుతో మరింత వైభవంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ క్యాడర్లో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. పార్టీ క్యాడర్లో చాలా వరకూ వివిధ రకాల పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో పనులు చేయలేక ప్రజల ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గడప గడపలోనూ ప్రశ్నల వర్షం ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా సైలెంట్‌గా ఉన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఉండి ఉంటే.. ఆయన దృష్టిలో పడేందుకైనా ఏదో ఒకటి చేసి ఉండేవారు.
పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు అయినా ఇచ్చి ఉండవారు. కానీ ఆయన పత్రిలో కూడా ప్రజాధనంతో కొన్ని ప్రభుత్వ కార్పొరేషన్లు ఇచ్చిన చిన్న చిన్న ప్రకటనలు తప్ప.. ఇతర ప్రకటనలేమీ లేవు. నిజానికి అధికంలోకి వచ్చిన నాలుగేళ్ల పాటు ఏ అధికారపార్టీలో అయినా ఉత్సాహం ఉంటుంది. విచిత్రంగా వైసీపీలో మూడేళ్లోల నీరసం ఆవహించేసింది. సొంత క్యాడర్ కూడా ఆసక్తి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది.