టీవీ చానల్ రేటింగ్లో 99 టీవీ కొద్దిగా మెరుగుదల చూపించింది. కానీ.. చాలా చాలా తక్కువ. గత వారం.. పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమండ్రిలో కవాతు నిర్వహించారు. బీభత్సమైన పబ్లిసిటీ చేశారు. సహజంగా.. పవన్ కల్యాణ్ లేదా జనసేన ఈవెంట్ అంటే.. 99 టీవీకే ఎక్స్క్లూజివ్ ఫీడ్ ఉంటుంది కాబట్టి.. ఫ్యాన్స్ అంతా ఆ చానల్ చూడటానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంతో టీఆర్పీ బాగా మెరుగుపడుతుందని భావించారు. కానీ.. మహా, సీవీఆర్, టీవీ వన్ చానళ్లను మాత్రమే అధిగమించ గలిగింది. రేటింగ్స్ విషయంలో టీవీ నైన్… మళ్లీ నెంబర్ వన్ పొజిషన్ తెచ్చుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ కవాతును.. టీవీ 9 పూర్తిగా బాయ్ కాట్ చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్… తన క్రేజ్ ను వాడుకుని మీడియా టీఆర్పీలు తెచ్చుకుంటోందని భావిస్తూఉంటారు. వ్యక్తిగతం ఆయన ఈ తరహా వ్యాఖ్యలు అనేక సార్లు చేశారు. తనకు మీడియా కవరేజీ ఇవ్వడానికి కారణం వారికి టీఆర్పీలు రావడమేనని.. అందుకే.. తనకు మీడియా అవసరం కన్నా.. తన అవసరం మీడియాకు ఉందన్నట్లు వ్యవహరించేవారు. ముఖ్యంగా టీవీ 9తో వివాదం ఏర్పడిన తర్వాత ఆయన… టీవీ 9 విషయంలో.. అవసరం లేదన్నట్లు వ్యవహరించారు. సొంత మీడియాను సమకూర్చుకున్న తర్వాత.. టీవీ9 లోగోను.. కూడా దూరంగా పెట్టమనేవారు. తన అభిమానులు, సోషల్ మీడియా టీం.. శతఘ్నితో .. టీవీ 9కి వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహించారు.
సోషల్ మీడియాలో ఆ చానల్ ను అన్ సబ్ స్క్రైబ్ చేయాలని.. జీరో రేటింగ్ ఇవ్వాలని ఇలా ఓ క్యాంపైన్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆ టీవీ చానల్ రేటింగ్ పడిపోతుందని అనుకున్నారు కానీ… పరిస్థితి అలా లేదు. అత్యంత హైప్ క్రియేట్ చేసిన ధవళేశ్వరం కవాతును.. టీవీ 9 బృందం.. కవేరేజీ ఇవ్వలేదు. న్యూస్ గా భావించి కొంత సేపు ఇవ్వాలనుకున్నా చివరి క్షణంలో వెనక్కి తగ్గింది. నిజానికి ఆ సమయంలో..మిగతా చానళ్లు కవరేజీ ఇచ్చాయి. ఒక్క టీవీ వైన్ మాత్రమే కావరేజీ ఇవ్వలేదు. అయినప్పటికీ.. ఆ టీవీ చానల్ రేటింగ్ ఇసుమంత కూడా తగ్గలేదు. తాజాగా ప్రకటించిన రేటింగ్స్ లో టీవీ నైన్ నెంబర్ వన్ ర్యాంకులో ఉంది.
- TV9: 57
- NTV: 41
- TV5: 38
- V6: 36
- T NEWS: 26
- SAKSHI: 24
- ABN: 19
- HM TV: 11
- ETV AP: 11
- AP 24×7: 10
- GEM N: 9
- ETV TS: 9
- 10TV: 7
- 99%TV: 6
- MAHAA NEWS: 3