న్యూజిలాండ్‌లో పురుషుల క్రికెట్ టీమ్ వరుసగా ఓడిపోతూంటే… మరో వైపు.. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించి.. కాస్త ఊరటనిచ్చింది భారత టీమ్. ప్రపంచకప్ గెలిస్తే. పురుషులతో పాటు.. మహిళల క్రికెట్‌కు క్రేజ్ వస్తుందని.. విశ్లేషకులంతా.. అనుకుటున్న సమయంలో.. సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వచ్చేశారు. ఇక కప్ గెలవడమే ఆలస్యం.. చరిత్ర సృష్టించడమేనని అందరూ అనుకున్నారు. కానీ.. చివరి మెట్టుపై మహిళల క్రికెట్ టీమ్ బోల్తా పడింది. భారీ లక్ష్య చేధనలో.. స్టార్ ప్లేయర్లంతా ఒత్తిడికి చిత్తయ్యారు. ఫలితంగా.. రన్నరప్‌తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
మెల్బోర్న్లో జరుగిన ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల టీం మొదట బ్యాటింగ్ చేసి.. 185 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. ఇది భారీ లక్ష్యమే. ఆస్ట్రేలియా టీం ఓపెనర్లు దడదడలాడించడంతో.. భారత బౌలర్లు పరుగులివ్వడమే తప్ప.. కంట్రోల్ చేయలేకపోయారు. అయితే.. స్టార్ బ్యాట్స్మెన్లు.. అలవోకగా సిక్సర్లు కొట్టే ఆటగాళ్లు ఉండటంతో.. టీమిండియాకు ఆశలు ఉన్నాయని అనుకున్నారు. లీగ్ దశలో.. పరుగుల వరద పారించిన షెఫాలి, స్మృతి మందాన లాంటి వాళ్లు..భారీ లక్ష్యాన్ని చూసి మొదట్లోనే ఒత్తిడికి గురై వికెట్లు చేజార్చుకున్నారు. ఒక్కరు కూడా నిలకడగా ఆడలేకపోవడంతో.. ఒకరు రిటైర్డ్ హర్ట్‌గా వెను దిరగడంతో.. 99 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ముగించేసింది. దీంతో ఆస్ట్రేలియా మహిళల టీ ట్వంటీ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. పురుషుల టీమ్‌కు ధీటుగా.. క్రీడా ప్రేమికుల అటెన్షన్‌ను దక్కించుకోవడంలో.. మహిళా ప్లేయర్లు సక్సెస్ అయ్యారు. ఆటతో పాటు..అందంతోనూ ఆకట్టుకునే ప్లేయర్లు ఉండటంతో.. ఈ ఫైనల్‌పై… క్రికెట్ ప్రేమికులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. స్మృతి మందాన, షెఫాలి లాంటి వాళ్ల మెరుపులు చూడవచ్చనుకున్నారు. కానీ.. నిరాశే ఎదురయింది. అయితే.. మహిళల క్రికెట్ జట్టుకు మంచి ఫ్యూచర్ ఉందని.. పురుషుల టీమ్‌తో ధీటుగా ప్రజాదరణ పొందుతుందున్న సంకేతం మాత్రం… ఈ టోర్నీ ద్వారా వచ్చింది.