ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వాణిజ్య రాజధానిగా విజయవాడ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత మరింత కీలకంగా మారింది. అయితే విజయవాడ ఇప్పటికీ మెట్రో లుక్ సాధించలేకపోతోంది. ధనిక ఆదాయ వర్గాలు పెరుగుతున్నా.. విలాసవంతమైన ఇళ్ల ప్రాజెక్టులు మాత్రం పెరగడం లేదు. అత్యంత ధనవంతులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నా.. ఎక్కువ మంది హైదరాబాద్ కేంద్రంగానే ఉంటున్నారు.
హైదరాబాద్ , విశాఖ శివారుల్లో లగ్జరీ విల్లాలు నిర్మాణం జోరుగా సాగుతోంది. కొనుగోలుదారులూ ఆసక్తి చూపిస్తున్నారు. అవి మారుతున్న జీవన శైలికి అద్దం పడుతున్నాయి. అలాంటి మార్పు విజయవాడలో కనిపించడం లేదు. బిల్డర్లు విల్లాలు.. గేటెడ్ కమ్యూనిటీలపై ఇంకా దృష్టి పెట్టలేదు. డిమాండ్ ఉండదని అనుకుంటున్నారో లేకపోతే.. ఇంకా విజయవాడకు ఆ లుక్ వచ్చే సమయం లేదనుకుంటున్నారో రియల్ ఎస్టేట్ వర్గాలకే తెలియాలి.
ఇప్పుడిప్పుడే కొంత మంది బిల్డర్లు లగ్జరీ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలతో ఉండేలా చూస్తున్నారు. హెలిప్యాడ్ల వంటివి మాత్రం ఆలోచించలేకపోతున్నారు. పెద్దపెద్ద బిల్డర్లు. .అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తే .. భవిష్యత్ లో మంచి పెట్టుబడి అవుతుదంన్న ఉద్దేశంతో ధనవంతులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడం.. పెట్టుబడులు అక్కడ ఇరుక్కుపోవడంతో కొంత మంది బిల్డర్లు రిస్క్ చేయలేకపోతున్నారు. కానీ త్వరలో .. హైదరాబాద్, విశాఖ స్థాయి స్థాయిలో లగ్జరీ ప్రాజెక్టులు వస్తాయని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నారు. ప్రతిపాదిత ఓఆర్ఆర్ చుట్టూ వీటికి మంచి మార్కెట్ ఉంటుంది.