మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యమవుతోంది..?. దాదాపుగా రెండు నెలలు గడిచినా… ఎందుకు.. కేసీఆర్ సైలెంట్‌గా ఉంటున్నారు..?. అంటే.. టీఆర్ఎస్ నేతలకు సమాధానం లేదు. కేసీఆర్ ఏం చేసినా.. రాజకీయంగా పక్కాగా ఆలోచించి చేస్తారు కాబట్టి.. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేమని.. ఎప్పుడు పిలుపు వస్తే.. అప్పుడు వెళ్లడం మినహా మరో మార్గం లేదని లైట్ తీసుకుంటున్నారు. అయితే.. అంతర్గతంగా మాత్రం… చర్చోపచర్చలు చేసేస్తున్నారు. హరీష్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదనే విషయాన్ని.. తన చేతల ద్వారా ఇప్పటి వరకూ.. సూచనలు పంపించారని… హరీష్‌ను మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికే.. ఈ ఆలస్యం అని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు కూడా.. కేసీఆర్ మనసును అర్థం చేసుకున్నట్లుగా సూచనలు పంపుతున్నారు. తన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేసినట్లు చెబుతున్నారు.
హరీష్ రావు… ఏ కార్యక్రమంలోనూ పెద్దగా కనిపించడం లేదు. సిద్దిపేటలో మాత్రమే.. పర్యటిస్తున్నారు. ఇతర పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అంటే.. ఓ రకంగా.. హరీష్ కూడా రియలైజ్ అయ్యారు. ఇక ఈ వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం మళ్లీ ప్రారంభమయింది. అయితే.. ఇప్పుడు హరీష్‌కు మాత్రమే కాదు.. కేటీఆర్‌కు కూడా మంత్రి పదవి లేదనే ట్విస్ట్.. టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్…. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. కేటీఆర్ పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టారు. ఈ కారణంతో కేటీఆర్‌కు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం లేదంటున్నారు. అయితే.. పార్టీని కేటీఆర్‌కు అప్పజెప్పి.. హరీష్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. కేటీఆర్‌కు ఇచ్చి.. హరీష్‌కు మంత్రి పదవి ఇవ్వకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని కేసీఆర్ భావించి.. కేటీఆర్నుకూడా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇద్దరి సేవలు పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్…వచ్చే పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అంటే మొదటి విస్తరణలో… హరీష్, కేటీఆర్‌లకు అవకాశం లేదని దాదాపుగా తేలిపోయినట్లే..!