రాజధాని మార్పు కోసం… ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ భేటీ ఒక రోజు వాయిదా పడింది. మామూలుగా ఆరో తేదీన అని.. వారం రోజుల కిందటే ప్రకటించారు. కానీ.. ఒక రోజు ముందు .. ఒక రోజు తర్వాతకు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కారణం.. హైపవర్ కమిటీలో ఉన్న కొంత మంది మంది మంత్రులు అందుబాటులో లేకపోవడమేననే కారణాన్ని మీడియాకు చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వం.. హైపవర్ కమిటీకి ఇచ్చిన ప్రయారిటీ.. అంతకు మించి.. మ్యాటర్ సీరియస్‌నెస్‌ను చూస్తే.. అసలు హైపవర్ కమిటీ.. మీటింగ్ వాయిదా పడకూడదు. పైగా కమిటీని నియమించి వారం రోజులు అయింది. మంత్రులంతా.. దానికి తగ్గట్లుగా తమ షెడ్యూళ్లను రీషెడ్యూల్ చేసుకోవడానికి తగినంత సమయం ఉంది. అయినా సరే.. ఒక రోజు ముందు హైపవర్ కమిటీ భేటీ వాయిదా ప్రకటన వచ్చింది.
హైపవర్ కమిటీ భేటీ వాయిదా రాజకీయవర్గాల్లోనూ కాస్త చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే.. ఈ కమిటీలో మంత్రులు ఉన్నారు.. అధికారులు కూడా ఉన్నారు. మంత్రులు ఎలాగూ.. ముఖ్యమంత్రికి ఏది ఇష్టమైతే అదే నివేదిక ఇస్తారు. చాలా రోజులుగా.. అదే చెబుతున్నారు కూడా. కానీ.. అధికారులు మాత్రం.. ముఖ్యమంత్రి చెప్పినట్లు మౌఖికంగా చేస్తారేమో కానీ… ఆదేశాల ప్రకారం.. ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్లుగా నివేదికలు ఇవ్వడం కష్టం. భవిష్యత్‌లో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుని దానికి తగ్గట్లుగా నివేదికలు ఇస్తారు. అది సహజం. ఇక్కడే.. తేడా వచ్చిందనే ప్రచారం .. జరుగుతోంది.
విశాఖ రాజధానిగా శాంతిభద్రతల దృష్ట్యా వర్కవుట్ కాదని.. డీజీపీ గౌతం సవాంగ్ అభిప్రాయం. రాజధాని విషయం అని కాకుండా.. పోలీసు శాఖ పరంగా.. ప్రతీ ఏడాది ఇచ్చే నివేదికల్లో విశాఖనే ఆయన అత్యంత క్లిష్టమైన జిల్లాగా పేర్కొంటూ.. కొద్ది రోజుల కిందట నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నక్సలైట్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపడం.. నక్సలైట్లకు అడ్డాగా ఉన్న.. ఏవోబీ ఏరియా మొత్తం.. ఆ జిల్లా సరిహద్దులో ఉండటంతో.. పోలీసుల లెక్క ప్రకారం.. విశాఖకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం కష్టం. ఈ విషయంలోనే ప్రభుత్వంలో కాస్త తేడా జరుగుతోందని.. అందుకే ఒక రోజు వాయిదా వేశారన్న ప్రచారం అంతర్గతంగా జరుగుతోంది. నిజం ఏమిటో మరి..?