ఏపీలో లిక్కర్ పాలసీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది. సోమవారం లిక్కర్ షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తారు. కొత్త పాలసీ ప్రకారం జే బ్రాండ్లకు చాన్స్ ఉండదు. పాపులర్ బ్రాండ్స్ అన్నీ తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం లిక్కర్ ధరల సవరణ పైన గజెట్ జారీ చేసింది. వైసీపీ హయాంలో అన్నీ జే బ్రాండ్స్ అమ్మేవారు. బూమ్ బూమ్ బీర్ల దగ్గర నుంచి ప్రెసిడెంట్ మెడల్ విస్కీ వరకూ అన్నీ లోకల్ తయారీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేవారు.
మొత్తం మద్యం తయారీ దగ్గర నుంచి మందు బాబులకు చేర్చే వరకూ మొత్తం వారి గుప్పిట్లోనే ఉండటంతో దోపిడీకి అంతు లేకుండా పోయింది. ప్రభుత్వం మారిన తర్వాత పాలసీ ఖరారు చేయడానికి.. నాలుగు నెలల సమయం పట్టింది. ఇక అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ధరలు కూడా సగానికి సగం తగ్గనున్నాయి. బీర్లు 130 కే లభించే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఇవి 220 వరకూ వెళ్లాయి. వైసీపీపై సొంత ఓటర్లు కూడా వ్యతిరేకం అవడానికి ఇదే కారణం. పేదల్ని ఇష్టారీతిన దోచుకున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు.
తాగేవారిని ఆపలేనప్పుడు.. వీలైనంత వరకూ వారి ఆరోగ్యాలను కాపాడటం… మద్యంపై వెచ్చించే మొత్తాన్ని తగ్గించేలా చేసి ఆ కుటుంబాలకు వెసులుబాటు కల్పించడమే కీలకం. ప్రభుత్వం తాజా లిక్కర్ పాలసీని అదే ప్రమాణాలతో డిజైన్ చేసింది. పదహారో తేదీ నుంచి ఏపీలో జే బ్రాండ్లకు ముగింపు లభించినట్లే.