సమంత పెళ్లి కబురు… టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా.. అంటూ ఇటీవల సమంత ఓ ప్రధాన తెలుగు దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ హీరోతో ప్రేమలో ఉన్నానని… అతనెవరో త్వరలో చెబుతా అని ఊరించింది. దాంతో.. సమంత పెళ్లిపై రకరకాల వార్తలు పుట్టేశాయి. సమంత ఫలానా హీరోనే ప్రేమిస్తోంది.. అంటూ గాసిప్పులు షికారు చేశాయి. సమంత పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న ఊహాగానాలు జోరందుకొన్నాయి. వీటిపై సమంత మళ్లీ స్పందించింది.
“No more talk of marriage until I say so … I I I I ME ME ME ME aka SAMANTHA says so . Thankyou” అంటూ సమంత లేటెస్టుగా ట్వీట్ చేసింది. నేను చెప్పేంత వరకూ పెళ్లి గురించి మాట్లాడొద్దు అంటోంది సమంత. ఆమె పెళ్లి వార్తలపై నిర్మాతలు కూడా కలవరపడ్డారు. సమంత సడన్‌గా పెళ్లి చేసుకొని వెళ్లిపోతే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలకు పెద్ద దెబ్బ. వాళ్ల కంగారు తొలగాలనే సమంత ఇలా ట్వీట్ చేసిందని సమాచారం. మొత్తానికి సమంత పెళ్లి గోల కొంతకాలం సర్దుమణిగే అవకాశాలున్నాయి. సమంత మళ్లీ నోరు విప్పే వరకూ సమంత మనసులో ఉన్న హీరో ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
No more talk of marriage until I say so … I I I I ME ME ME ME aka SAMANTHA says so . Thankyou ?????
— Samantha (@Samanthaprabhu2) May 23, 2016