గోపీచంద్ – చంద్రశేఖర్ హిట్ కాంబినేషన్. ఒక్కడున్నాడు, సాహసం చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. కథ కూడా సిద్ధమైపోయిందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పుకున్నారు. అయితే… ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఈ కాంబోలో సినిమా లేదట. అసలు గోపీయంద్ – చందూల మధ్య సిట్టింగే జరగలేదని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ చంద్రశేఖర్‌కి అడ్వాన్స్ ఇచ్చింది. ఈ బ్యానర్లో చందూ ఓ సినిమా చేయాలి. ఆ సంస్థ చేతిలో చాలామంది హీరోలున్నారు. నాగచైతన్య, నాని, అఖిల్.. ఇలా యంగ్ స్టర్స్ తో పాటు అగ్ర కథానాయకులూ అడ్వాన్సులు తీసుకున్నారు. కథ ఎవరికి సెట్టయితే.. వాళ్లతో చందూ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, అది పూర్తయ్యాకే హీరో ఎవరన్నది తెలుస్తుందని సమాచారం.