వినోదం పేరుతో అసభ్యపదజాలం, విచ్చలవిడి శృంగారం, మితిమీరిన హింసతో కూడిన కంటెంట్‌ను యథేచ్చగా వదిలేస్తున్నాయి ఓటీటీ వేదికలు. క్రియేటివిటీ పేరుతో దర్శక-నిర్మాతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వున్నాయి. సినిమాలకు ఉన్నట్లే ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్షిప్ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తాజాగా దర్శకుడు మహి రాఘవ తీసిన సైతాన్ వెబ్ సిరిస్ పై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓటీటీ సెన్సార్షిప్ పై మరోసారి చర్చకు వచ్చింది. తాజాగా దర్శకుడు ఓటీటీ సెన్సార్షిప్ పై స్పందించాడు. ”సినిమా, టీవీ, ఓటీటీ వేర్వేరు ఫార్మెట్లు. సినిమా, టీవీలో చెప్పలేని కథలు చేపడానికి ఓటీటీ. ఇక్కడ కూడా కోతలు వుంటే ఇంక ఓటీటీలు ఎందుకు.. అందరూ కలసి హాయిగా టీవీలు చూసుకోవచ్చు. నిజానికి ఓటీటీకి స్వీయనియంత్రణ వుంది. కొన్ని రెగ్యులేషన్ ప్రకారమే కంటెంట్ ని విడుదల అవుతున్నాయి” అని చెప్పుకొచ్చాడు.