హైడ్రా విషయంలో జరిగిన తప్పుడు ప్రచారాన్ని చేతలతో క్లియర్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైడ్రామా అధికారాలు, పరిమితులతో పాటు అన్ని అనుమతులు ఉన్న భవనాలను కూల్చే ప్రసక్తే ఉండదని పదే పదే చెబుతోంది. తాజాగా హైడ్రా ఎన్వోసీ అవసరం లేదని.. ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకర్లు హౌస్ లోన్లు.. ఇతర ప్రాజెక్టుల లోన్లు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఫండింగ్ సమస్యలను బడా ప్రాజెక్టులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే లోన్ మంజూరైనప్పటికీ.. విడుదల చేయాల్సిన రుణాలను హోల్డర్ లో పెట్టి హైడ్రా నుంచి ఎన్వోసీ తీసుకు రావాలని అడుగుతున్నారు. వారంతా హైడ్రామా ఎన్వోసీ కోసం పరుగులు పెడుతున్నారు. అయితే హైడ్రా అనే వ్యవస్థ అధికారాల్లో. ఈ ఎన్వోసీలు ఉండవు. హైడ్రా విధులు వేరు. అందుకే ప్రభుత్వం హైడ్రా ఎన్వోసీ గురించి అడగవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేసింది.
అనుమతుల విషయంలో హెచ్ఎండీఏ, రెరాతో పాటు ఇతర చట్టబద్ద వ్యవస్థల అనుమతులు ఉన్నవి సరిపోతాయి. అలాంటి అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల జోలికి హైడ్రా వెళ్లదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ విధమైన సంకేతాలను పంపింది. ఇక ముందు హైడ్రా కూడా దూకుడుగా వ్యవహరించకుండా.., కూల్చే భవనాలు ఎలా చట్ట విరుద్ధమో స్పష్టంగా చెప్పిన తర్వాతనే కూల్చే అవకాశం ఉంది.