1940 అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టిన ఆదా శర్మ పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ అయితే నితిన్ సినిమాలో గ్రాండ్ గా ఇచ్చినా అమ్మడు కెరియర్ మాత్రం ఆశించినంత విధంగా లేదన్నది అసలు నిజం. పూరి హీరోయిన్ అంటే స్పెషల్ క్రేజ్ ఆ దర్శకుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయిన భామలు చాలా మంది ఉన్నారు. కాని ఆదా శర్మ మాత్రం అవకాశాన్ని అందిపుచ్చుకోలేక వచ్చిన చిన్న చిన్న క్యారక్టర్స్ చేస్తూ సరిపెట్టుకుంటుంది.
గ్లామర్ డాల్ లా ముద్దు ముద్దు మాటలతో ఇంప్రెస్ చేసే ఆదా ఎందుకు సినిమాల్లో అసలు ఉపయోగపడని క్యారక్టర్స్ చేస్తుందో అర్ధం కావట్లేదు ఆమె అభిమానులకు. మొన్న సన్నాఫ్ సత్యమూర్తి ఈరోజు సుబ్రమణ్య ఫర్ సేల్ ఇలా అమ్మడు తనకు అక్కర్లేని, ఏమాత్రం ఇమేజ్ రాని క్యారక్టర్స్ చేసి అబాసు పాలు అవుతుంది. ఈ క్యారక్టర్స్ చేయడం వలన తన మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈ హాట్ గాళ్ కు వచ్చింది.
అందం అభినయం ఉన్నా ఈ చార్మింగ్ గాళ్ కి అవకాశాలు ఎందుకు రావట్లేదో అర్ధం కాని విషయం. మొదటి సినిమా హార్ట్ ఎటాక్ తోనే ఆడియెన్స్ ని హార్ట్ నిజంగానే బ్రేక్ చేసిన ఈ అమ్మడు అందాలు ఏ దర్శక నిర్మాత సరిగా ఉపయోగించుకోలేక సినిమాలో ఏదో చిన్న పాత్రలకు సరిపెడుతున్నారు. కెరియర్ పరంగా కాస్త ఇబ్బంది పడుతున్న అమ్మడి ఫ్యూచర్ గాడిలో పడేది ఎప్పుడో మరి.