సజ్జల రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో డిటెయిన్ చేస్తే ఏపీ పోలీసులు పర్వాలేదు వదిలి పెట్టమని సలహా ఇస్తే అప్పుడు బయటపడ్డారు. విజయవాడకు రాగానే ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. దీంతో ఆయన తోకతొక్కిన పాములా కస్సుబుస్సులాడుతున్నారు. అసలు నేనేంటి.. నోటీసులేంటి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఆయనపై ఆయన మాట్లాడుకోవడం వేరు.. ఆయనకు మద్దతుగా ఇతరులు మాట్లాడటం వేరు. ఇతరులు ఆయన కోసం ఒక్కరూ కూడా నోరు మెదపడం లేదు.
సజ్జల రామకృష్ణారెడ్డి తనపై కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నరనిచాలా కాలంగా చెబుతున్నారు. అయితే మా రెడ్డిగారిని వేధిస్తే ఊరుకునేది లేదని పార్టీలోని ఇతర నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. మామూలుగా అయితే జగన్ రెడ్డి కన్నా వైసీపీలో ఆయనే పవర్ ఫుల్ . పార్టీలో పదవులు.. గతంలో ప్రభుత్వంలో పదవులు అన్నీ ఆయనే ఫైనల్ చేసేవారు. అంత కీ రోల్ నిర్వహించిన తర్వాత ఆయనకు కనీసం సగం మంది మద్దతైనా ఉండాలి. కానీ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీలో ఒక్కరికీ సాఫ్ట్ కార్నర్ లేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీకి ఆయనే నేతృత్వం వహిస్తారని 90 శాతం మంది నమ్ముతున్నారు. ఆయన వల్లే పార్టీ నాశనమైపోయిందని కూడా అనుకుంటున్నారు. అందుకే ఆయనను దూరం చేయాలని .. పెట్టాలని చాలా మంది సలహాలిస్తూ వస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఆయనే సర్వస్వం అన్నట్లుగా ఉన్నారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం ఆయనకు ఇంకా ఇంకా చాలా కష్టాలు రావాలని.. జగన్ హయాంలో జరిగిన ప్రతి తప్పునకు ఆయననే బాధ్యుడ్ని చేయాలని అనుకుంటున్నారు.