ఢిల్లీలో ప్రధాని మోడీతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంపై ఎక్కువ ఆశలు వద్దని నిన్ననే చెప్పుకున్నాం. వారిద్దరి మధ్య రాజకీయ అవసరాలు వారిద్దరినీ భేటీలో కూచోబెట్టి వుండొచ్చు తప్ప కేంద్రం వైపు నుంచి అంగుళమైనా అడుగు కదిలింది లేదు. వురు విల్ డూ ద బెస్ట్ అనే రొటీన్ డైలాగ్ తప్ప ప్రధాని నోట మరో నిర్దిష్టమైన లేదా కనీసం దృఢమైన హామీ రాలేదని మీడియా గోష్టిలోచంద్రబాబు మాటలు, శరీర భాష కూడా చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఇచ్చిన హామీల మేరకు అందిన సహాయం కూడా లేదని చెప్పేశారు. ఎంతగానో పొగిడిన ప్యాకేజి కింద 16వేల కోటు ్ల రావలసి వుంటే కేవలం 3780 కోట్టు మాత్రమే రావడం ఇందుకో ఉదాహరణ. రెవెన్యూ లోటు మొత్తం ఇవ్వడం అటుంచి అయిదో ఏడు వస్తున్నా అసలు లెక్క తేలలేదట. షెడ్యూలు 13 కింద ఇచ్చామని అదేపనిగా చెప్పే సంస్థలు 9కి 11 వేల కోట్లు అవసరం కాగా ఇప్పటికి కేటాయించింది 480 కోట్లు! ఇంకో రెండు మొదలే కాలేదు. రాజధాని నిర్మాణానికి నేరుగాఇచ్చింది 3000 కోట్టు మాత్రమే. విజయవాడ గుంటూరు డ్రైనేజికి ఇచ్చిన వెయ్యి కోట్లు కలిపినా 4 వేలే. కాని హరిత రాజదాని నిర్మాణానికి చాలా కావాలని ముఖ్యమంత్రి మనవి. పోలవరం విషయంలోనూ ఇవ్వాల్సింది ఇంకా దాదాపు 4 వేల కోట్లు వుంది. మూడు మాసాలు పనులు ఆగిపోవడం వల్ల 2018కి నీరిచ్చే ప్రతిపాదన కూడా సందేహంలో పడింది. ట్రాన్స్ట్రారు స్థానంలో కొత్త కాంట్రాక్టరును పిలవడానికి మరో వారం సమయం తీసుకుంటారు. 2019కి ఒకేసారి పూర్తి చేస్తే మంచిదేమో ఆలోచిస్తారు. ఈ మాటలలో ధ్వనించే అర్థం స్పష్టమే. ఇవన్నీ నిర్మాణానికి సంబంధించినవి కాగా భూ సేకరణ, పునరావాసంపై ఎలాటి కేటాయింపులు లేవు. ఎప్పటిలాగే చేస్తానని చెప్పడం తప్ప ఇదమిద్దంగా కాలవ్యవధితో హామీ కూడా రాలేదు. అయినా మనం నమ్మకంతో వుండాలని అదే కాపాడుతుందని చంద్రబాబు చెప్పిన మాటలు వేదాంతాన్ని ధ్వనిస్తున్నాయి.బిజెపి నేతల విమర్శలు కేంద్రం ఆటంకాలకు సంబంధించిన అంశాలపై ఆయన రాజకీయాల్దంటూ దాటేశారు. పోలవరంపై ఇద్దరూ కొంత సర్దుకుని ఒక అవగాహనకు రావడం వల్లనే ఈ సమావేశం జరిగిందని అర్థమవుతుంది. వారి సర్దుబాటుకు రాష్ట్రం చెల్లించే మూల్యం ఏమిటో ముందు ముందు తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వం తప్పిదాలను వైసీపీ నేత జగన్ను విమర్శించేందుకు ఉపయోగించిన తీవ్రభాషతో పోలిస్తే మోడీ సర్కారు జాప్యం సహాయ నిరాకరణ వంటివాటిని ప్రస్తావించేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధపడలేదు.
సర్వీసు రంగంలోనూ ఆదాయంలోనూ తెలంగాణకన్నా వెనకబడి వున్నట్టు దక్షిణాదిలోనే ఆఖరున వున్నట్టు ఆయన చెప్పడం రాజకీయంగా ప్రజలను సిద్ధం చేయడానికి ఉద్దేశించిందే.