ప్రజాస్వామ్యం అనే దానికి వైసీపీలో అసలు అర్థం వేరు. జగన్ రెడ్డి ఏది చెబితే అది.. జగన్ రెడ్డికి ఏది అవసరం అయితే అది చేయడమే వైసీపీ ఎంపీల పని. దాని కోసం ప్రత్యేకంగా సమావేశాలు ఎందుకని లైట్ తీసుకుంటూ ఉంటారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు ప్రతి పార్టీ .. పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహిస్తుంది. పార్లమెంట్ లో లేవెనెత్తాల్సిన అంశాలను ఖరారు చేసుకుంటుంది. వైసీపీలో అలాంటిదేమీ ఉండదు. అలాంటి భేటీలు జరగక చాలా రోజులు అయింది.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై లెవనెత్తేందుకు మంచి అవకాశం ఉంది. ఇతర పార్టీలకు మూడు సీట్లే ఉన్నాయి. వైసీపీకి లోక్ సభలో ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నారు. మూడో అతి పెద్ద పార్టీ కూడా. అయినా ఆ ఎంపీలకు నోరు ఉండదు.. చెప్పిందే మాట్లాడాలి.. రాష్ట్రం కోసం అసలు మాట్లాడకూడదు అనే సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి.. పార్లమెంట్ లోకి వెళ్లి టీడీపీ వాళ్లు మాట్లాడితే వాళ్లపై బూతులతో విరుచుకుపడాలి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రఘురామతో పాటు టీడీపీ ఎంపీలను చంపేస్తామని బెదిరించాలి.. వంటి టాస్కులు ఇస్తూంటారు అవే చేస్తూంటారు.
గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు పోటీ పడి ఆందోళనలు చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా మారాయి.ఎంపీలు ఉన్నారంటే ఉన్నారు. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నిందితుడ్ని విదేశాల్లో అరెస్ట్ చేస్తే ఆయనను కాపాడటానికి ఎంపీలందరూ కలిసి మంత్రి వద్దకు వెళ్తారు.. కానీ ఏపీలో పోలవరం నిధులపై మాత్రం… ఒక్కరూ అడగరు. రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చేశారు. దీనికి కారణం ఎవరో కాదు….!