భారతీయ జనతా పార్టీ నేతల గురి ఇప్పుడు బెంగాల్ పై ఉంది. ఆ పార్టీకి దేశంలో ఉన్న ముఖ్య నేతలందరూ.. ఆ రాష్ట్రంలో..రోజు మార్చి రోజు వాలి పోతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గర్నుంచి ఎంపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకూ .. బీజేపీ అందర్నీ బెంగాల్ కు పంపుతోంది. అయితే.. వీరందర్నీ.. బెంగాల్ రాకుండా.. మమతా బెనర్జీ ప్రభుత్వం.. విచిత్రమైన వ్యూహాలు పన్నుతోంది. అందులో మొదటిది… హెలికాఫ్టర్లకు.. అనుమతి నిరాకరించడం. పొరుగు రాష్ట్రంలో వారు హెలికాఫ్టర్ లో బయలుదేరారు. తీరా.. బెంగాల్ దగ్గర గాల్లోకి వచ్చిన తర్వాత ల్యాండింగ్ కు అనుమతి నిరాకరిస్తారు. ఎక్కడ ఫ్యూయల్ అయిపోతుందేమోననే భయంతో వారు వెనుదిరిగి వెళ్లిపోతారు.
గత కొద్ది రోజులుగా.. ఇవి చాలా జరుగుతున్నాయి. ప్రధాని పర్యటనకు మినహా.. అమిత్ షా దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, స్మృతి ఇరానీ హెలికాఫ్టర్లను ల్యాండ్ చేసేందుకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో వారు పాల్గొనాల్సిన ర్యాలీలు రద్దయ్యాయి. సాధారణంగా వాతావరణం బాగోలేకపోతే అనుమతి నిరాకరిస్తారు. కానీ బెంగాల్ లో పరిస్థితులు రాజకీయ పరంగా ఉద్రిక్తంగా ఉన్నాయి. మమతా బెనర్జీ … బీజేపీ నేతలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వాలని అనుకోవడం లేదు. అందుకే..వీలైనంత వరకూ.. అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగానే హెలికాఫ్టర్లు ఎగరనీయడం లేదు.. దిగనీయడం లేదు. ఇది బీజేపీ నేతలకు మాత్రమే పరిమితం.
అయితే బీజేపీ నేతుల మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. బెంగాల్ సరిహద్దుల్లో దిగి.. రోడ్డు మార్గాల ద్వారా బెంగాల్ చేరుకుని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం పురులియా ప్రాంతంలో సీఎం యోగి చాపర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఝార్ఖండ్ లో ల్యాండ్ అయి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ర్యాలీ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. వెస్ట్ మిడ్నాపూర్‌లో జరగబోయే ర్యాలీకి శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి మమతా .. బీజేపీ నేతలపై ఇలా పగ తీర్చుకుంటున్నారు.