పెద్ద హీరో సినిమా వస్తోందంటే బెనిఫిట్ షోల హంగామా మొదలైపోతుంది. అర్థరాత్రి ఫ్యాన్స్ షో… హంగామా తప్పని సరి. సర్దార్ గబ్బర్‌సింగ్ బెనిఫిట్షోలతో కేక పుట్టించింది. రాత్రి 1.30గం.లకు అన్ని చోట్లా షోలు పడిపోయాయి. తెల్లారేసరికి టాక్ బయటకు వచ్చేసింది. సరైనోడుకీ బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే.. సరైనోడుకి మాత్రం పోలీసుల పర్మిషన్లు లభించడం లేదని టాక్. అర్థరాత్రి షోలు వద్దు.. కావాలంటే ఉదయం ఆరుగంటల షో వేసుకోండి.. అని పోలీసులు తేల్చి చెప్పారట.
దాంతో… సరైనోడు టీమ్ నిరుత్సాహపడిపోయింది. ఓ షో అదనంగా వేసుకొనే అవకాశం లేకపోవడం.. వసూళ్ల పరంగా దెబ్బకొట్టేదే. అయితే ఇదీ ఒకందుకు మంచిదే అన్నది సరైనోడు టీమ్ అభిప్రాయం. డివైడ్ టాక్ వస్తే.. తెల్లారేసరికి అభిమానుల ఉత్సాహం చల్లారిపోతుందని, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఉదయం ఆరుగంటల ఆటే బెటరని చిత్రబృందం భావిస్తోందట. అయినాసరే.. ఆఖరి క్షణాల వరకూ.. అర్థరాత్రి షో పర్మిషన్ల కోసం ప్రయత్నించాలని అల్లు అరవింద్ ఆర్డరేశారట. ప్రస్తుతం సరైనోడు టీమ్ మొత్తం ఆ పనిలోనే నిమగ్నమై ఉంది.