ప్రభుత్వం అంటే.. అబ్రకదబ్ర అని.. పనులు చేసేస్తుందా..? ఓ మహా ప్రళయం లాంటిది వచ్చినప్పుడు… ప్రజలకు ప్రభుత్వం అన్నీ ఇట్టే పనులు చేసేస్తుందా..? . టిట్లీ తుపాను.. సిక్కోలును..ముఖ్యంగా ఉద్దానంలోని ఆరు మండలాలను పూర్తిగా తుడిచి పెట్టేసింది. మిగతా మండలాల్లోనూ తీవ్ర ప్రభావం చూపించింది. ఇది హదూద్ కన్నా తీవ్రమైన విపత్తు. ఈ విషయం… అందరికీ తెలుసు. మీడియా అంత గొప్పగా.. ప్రచారం చేయకపోయినా… పల్టీలు కొట్టుకుంటూ పోయిన కంటెయిన్ లారీలే ఆ విపత్తు ఎంత తీవ్రమైనదోచెబుతుంది. టిట్లీ దెబ్బకు కరెంట్ స్తంభం అనేది ఆరు మండలాల్లో లేకుండా పోయంది. అంటే.. విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. అలాంటి పరిస్థితిలో… ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. వారికి ఉన్న పళంగా… మంచినీరు, ఆహారం.. కనీస అవసరాలు తీర్చడం… సవాల్‌తో కూడుకున్న పని. ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని సవాల్‌గా తీసుకుని… వీలైనంతగా… అందరికీ కనీస అవసరాలు తీర్చే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడే మోహరింప చేశారు. నాలుగైదు రోజుల్లోనే విద్యుత్ పరిస్థితిని గాడిలో పెట్టారు. ప్రజలకు నిత్యావసరాలు అందించారు. ప్రజలు ఏ మాత్రం అధైర్యపడకుండా… ఎప్పటికప్పుడు… పంట నష్టం అంచనాలు కూడా వేయించారు. ఇంత ప్రళయం జరిగినా.. ఒక్క కేంద్ర మంత్రి పరిశీలనకు రాలేదు… ఒక్క రూపాయి కేంద్రం నుంచి రాలేదు. అయినా చంద్రబాబు.. ఏ లోటూ రానీయలేదు. అంత తీవ్రమైన నష్టం జరిగితే.. ప్రభుత్వం తమను అంత బాగా చూసుకుంటుందని అక్కడి ప్రజలు కూడా ఊహించలేకపోయారు. ఇలాంటి విపత్తుల సమయంలో విపక్షాలు కానీ.. ఇతర పార్టీల నేతలు కానీ ఏం చేస్తారు. తమకు చేతనైనంత సాయం చేస్తారు. కానీ విపక్ష నేతలు మాత్రం… ఇతర ప్రాంతాల నుంచి.. మనుషుల్ని తీసుకొచ్చి.. సాయం అందలేదని ధర్నాలు చేయిస్తున్నారు. సహజంగా… ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల్లో అన్నీ కోల్పోయామనే ఆవేదన ఉంటుంది. దాన్ని వారు ప్రభుత్వంపైనే చూపిస్తారు. అలాంటి ఆవేదనను రెచ్చగొట్టి.. ప్రభుత్వాధికారులపై .. ప్రజాప్రతినిధులపై దాడులకు ఉసిగొల్పడానికి చేయని ప్రయత్నం లేదు.
చివరికి.. పిరియా సాయిరాజ్ అనే మాజీ ఎమ్మెల్యేను.. పక్కా ప్లాన్ ప్రకారం కిరోసిన్ పోసుకుని.. డ్రామా ఆడించారు. ఆయనను వైసీపీ నేతగా చెప్పుకుని ప్రచారం చేసుకున్నారు. కానీ.. ఆయన జగన్‌ను తన జీవితాన్ని నాశనం చేశారని బండబూతులు తిట్టి పార్టీ నుంచి వెళ్లిపోయిన వ్యక్తి. అయన మళ్లీ ఎప్పుడు.. పార్టీలో చేరారో కానీ.. అదే సీన్లా క్రియేట్ చేయబోయింది. చివరికి సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి.. సీఎం టూర్లోనే నినాదాలు చేయించబోయారు. వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. చేస్తే సాయం చేయాలి కానీ.. ఆదుకునేవారిని అడ్డుకునేలా ఈ చీప్ ట్రిక్కులేమిటన్న చర్చ.. ఉద్దానం అంతా.. నడుస్తోంది. ఇంతా ప్రతిపక్ష పార్టీ గురించే..!