టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారిగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేశారు. జగన్ రెడ్డి సర్వీస్ లో మునిగి తేలిన నలుగురు కీలక అధికారుల్ని జీఎడీకి అటాచ్ చేశారు. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, మురళీధర్ రెడ్డి ఉన్నారు. శ్రీలక్ష్మి తన పోస్టింగ్ ను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఆమెను దగ్గరకు రానివ్వలేదు. రాజధాని రైతుల కౌలు కూడా కోర్టు చెప్పినా ఇవ్వకపోవడంతో పాటు అనేక తప్పుడు నిర్ణయాల్లో ఆమె పాత్ర కీలకం. శ్రీలక్ష్మి ఇచ్చిన జీవోలను కోర్టులు ఎన్నో సార్లు కొట్టి వేశాయి.
జగన్ అక్రమాస్తల కేసుల్లో చాలా కాలం జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన తర్వాత తెలంగాణ క్యాడర్ కు వెళ్లారు. మళ్లీ జగన్ గెలవగానే విజయసాయిరెడ్డితో పాటు ఢిల్లీలో తిరిగి తిరిగి ఏపీలో పోస్టింగd తెచ్చుకున్నారు. మళ్లీ జగన్ చేసిన నిర్వాకాల్లో భాగం అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆమెపై ఎన్ని కేసులు పడతాయో అంచనా వేయడం కష్టం. ఇక ప్రవీణ్ ప్రకాశ్.. తేడా ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు పొందారు. ఆయన జగన్ ముందు మోకాళ్లపై నిలబడి పని చేస్తూంటారు.
ఇక రజత్ భార్గవ.. గతంలో చంద్రబాబుకు సన్నిహితుడు. కానీ చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించడానికి ఆయన పావుగా మారారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు తాను అక్రమాలకు పాల్పడ్డానని అంగీకరిస్తూ.. వాంగ్మూలం ఇచ్చారు. అసలు అక్రమాలే జరగకపోయినా జరిగాయని ఆయన వాంగ్మూలం ఇవ్వడం.దానికి చంద్రబాబు కారణం అని చెప్పడం సంచలనంగా మారింది. బెదిరించారని అందుకే ఇవ్వాల్సి వచ్చిందని టీడీపీ పెద్దల్ని కలిసి వేడుకున్నా.. చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పి పంపించినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ లో వీరికి పోస్టింగ్ లు దక్కడం కష్టమేనని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.