డేటాచోరీ కేసులో ఎలాంటి పురోగతి.. పోలింగ్ పూర్తయ్యే వరకూ కనిపించే అవకాశం లేదు. ఈ మేరకు హైకోర్టులో విచారణ ఏప్రిల్ ఇరవై రెండో తేదీకి వాయిదా పడింది. ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ల పరిధి కానప్పటికీ తెలంగాణ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని పిటిషన్లో ఆయన ఆరోపించారు. డేటా చోరీ అని కేసు నమోదుచేశారు. చోరీ జరిగిందో లేదో ఇంత వరకూ కన్ఫర్మ్ చేసుకోలేదు. చోరీ జరిగిందో లేదో ఎవరు చెప్పాలి.. కీలకమైన ఎన్నికల డేటా, ఆధార్ డేటా, ఏపీ ప్రభుత్వ సున్నితమైన సమాచారం చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు.
అసలు ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన డేటా పోయిందా.. లేదా? ఆధార్‌కు సంబంధించిన డేటా దుర్వినియోగం అయిందా.. లేదా? ఏపీ ప్రభుత్వ సమాచారం పోయిందా .. ?లేదా..?అనేది ఆ సంస్థలు, ప్రభుత్వం చెబితేనే తెలుస్తుందని.. వేరే వారు ఎలా చెబుతారని ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ ఆశోక్ తరపున ఆయన లాయర్ ప్రధానంగా వాదనలు విన్పించారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ సీఈవో, ఆధార్ నమోదు సంబంధించి ఏపీ వ్యవహారాలు చూసే రిజిస్ట్రార్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ ఇరవై రెండో తేదీకి కేసును వాయిదా వేశారు. మామూలుగానే ఈ కేసులో విషయం లేదని న్యాయనిపుణులు ఎప్పుడో నిర్ధారించారు. అసుల చోరీనే జరగలేదని… గతంలోనే ఎన్నికల సంఘం, ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓట్లు తొలగించడం అనేది జరగలేదని ఈసీ కూడా చెప్పింది.
ఆధార్ డేటా అసలు చోరీకి సాధ్యం కాదని… ఉడాయ్ కూడా.. ఎప్పుడో తేలిగ్గా తీసుకుంది. ఈ కేసును రాజకీయ కోణంలోనే పోలీసులు పెట్టారని.. దానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను .. తెలంగాణ పోలీసులు అమలు చేశారని.. పత్రాలు బయటకు వచ్చాయి. అయితే.. మళ్లీ విచారణకు వచ్చే సరికి.. ఏపీ, తెలంగాణలో పోలింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత కేసులో ఎలాంటి పరిణామాలు జరిగినా.. పెద్దగా ప్రభావం ఉండదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.