ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఓ పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు ఔటర్ నే హద్దులుగా చేసుకుని మొత్తంగా గ్రేటర్ లో కలిపే ఆలోచనలో ఉన్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం ఊహించినంతగా అభివృద్ధి సాగడం లేదు . నివాసాలు పెరగడం లేదు. అందులో హయత్ నగర్ దాటిన తర్వాత గత పదేళ్లలో చిన్న చిన్న కాలనీలు ఏర్పడ్డాయి కానీ.. వెంచర్లు ఏర్పాటయ్యాయి కానీ ఇతర చోట్ల మాదిరిగా డెలవప్ కాలేదు.
పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ ఇప్పటికీ నిర్మానుష్యంగానే కనిపిస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. కానీ చాలా మంది నివాసాలకు కోసం కాకుండా.. పెట్టుబడి ప్రకారమే స్థలాలు కొంటున్నారు. అక్కడ నివాసయోగ్యమైన కాలనీల నిర్మాణంపై.. గేటెడ్ కమ్యూనిటీలపై రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే ఆ సమీప గ్రామాల్లో చిన్న చిన్న మేస్త్రీలు, బిల్డర్లు కట్టే ఇళ్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంటోంది. కానీ రీసేల్ మాత్రం కష్టంగా మారుతోంది.
ఈ వైపు పెద్దగా ఉపాధి అవకాశాలు పెరగకపోవడం కారణంగా భావిస్తున్నారు. విజయవాడ హైవే అయినా… రామోజీ ఫిల్మ్ సిటీ తప్పితే.. మరో పెద్ద ఉపాధి కేంద్రం అక్కడ లేదు. గతంలోసంఘి వంటి పరిశ్రమలు ఉండేవి. అందుకే హైదరాబాద్ – విజయవాడను కలిపే ఈ హైవే మార్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంచి రవాణా సౌకర్యంతోపాటు… ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం కూడా కలసి వస్తోంది.
ఇటీవల ఓ కంపెనీ భారీ కంపెనీ ధోనిని ప్రచారకర్తగా పెట్టుకుని ఫిల్మ్ సిటీని దాటి ముందుగా పెద్ద వెంచర్ వేసింది. పెద్ద ఎత్తున జనం కొనుగోలు చేశారు అయితే అలాంటి వాటికి అనుమతులు లేవన్న విమర్శలు రావడంతో ఆ కంపెనీ తర్వాత కనిపించలేదు. దాని వెనుక నేతలున్నార ప్రచారంతో తెర వెనక్కు పోయింది. ఇలాంటి రియల్ ఎస్టేట్ ఫెయిల్డ్ ప్రాజెక్టులు కూడా హయత్ నగర్ దాటిన తర్వాత రియల్ అభిృద్ధికి ఆటంకాలుగా మారుతున్నయి.