ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కొరిక. సొంత ఇల్లు అంటే… చుట్టూ ఖాళీ స్థలం, కొన్ని చోట్లు .. ఉండేలా పొందికైనా ఇల్లు అని గతంలో ఊహించుకునేవారు. ఇప్పుడు ఇల్లు అంటే.. అపార్టుమెంట్లో 1000 SFT అయినా చాలని అనుకుంటున్నారు. అది కూడా కొనుక్కోవడానికి ఎంతో కష్టపడాల్సిన కుటుంబాలే ఎక్కువ ఉంటాయి.
భారీగా పెట్టుబడి పెట్టి.. అప్పులు చేసి కొంటున్న ఇంటికి వాల్యూ కూడా నిరంతరం పెరగాలని ఎవరైనా అనుకుంటారు. భవిష్యత్ లో తమకు సమస్య వస్తే ఇల్లు రీసేల్ కు డిమాండ్ ఉండాలని కోరుకుంటారు. అయితే అపార్టుమెంట్ల విషయంలో అయితే అనేక సమస్యలు వస్తాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. దీనికి కారణం అపార్టుమెంట్ పాతదయ్యే కొద్దీ.. దానికి విలువ తగ్గుతుందని భావించడమే. పాత భవనానికి నిజంగానే పెద్ద విలువ ఉండదు.కానీ ఆ భవనం ఉన్న స్థలం వాల్యూ మాత్రం నిరంతరం పెరుగుతూ ఉంటుంది.
ఐదేళ్ల ఓ అపార్టుమెంట్ ను 30 లక్షలకు కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పుడు అదే ప్రాంతంలో కొత్త ఆపార్టుమెంట్ 50 లక్షలు అవుతుంది. కానీ తమ ఫ్లాట్ ను రూ. 50ల లక్షలు అమ్ముకోవాలని ఐదేళ్ల కిందట కొనుగోలు చేసిన ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతుంది. కనీసం పది లక్షలు కోత పడుతుంది. నలభై లక్షలకే బేరాలొస్తాయి. దీనికి కారణం.. అపార్టుమెంట్ వయసు పెరగడం. కొత్తదానికి ఉన్న విలువ పాత అపార్టుమెంట్ కు ఉండదు.
ఈ సమస్య ఇండిపెండెంట్ హౌస్లకూ వస్తుంది కానీ.. స్థలం విలువ అనూహ్యంగా కలసి వస్తుంది. ఇండిపెండెంట్ ఇళ్లకు ఉండే సౌలభ్యత అపార్టుమెంట్లకు ఉండదు. విలువ పరంగా చూసుకున్నా అపార్టుమెంట్స్ కు కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్పుకోక తప్పదు.