అందాల తార అనుష్క శ్రమకూర్చి.. చమటోడ్చి చేసిన సినిమా అనుష్క.. యుద్ధాలు గట్రా చేసిన దాని కన్నా ఈ సినిమాలో అమ్మడు లావెక్కడం పెద్ద సమస్యగా మారింది. పోని ఇంతకష్ట పడ్డా సినిమా ఏమన్నా మంచి ఫలితాన్ని ఇచ్చిందా అంటే అదీ లేదు.. దీని కోసమా స్వీటీ ఇంత కష్టపడ్డది అని అనుకునేలా చేశారు. ఇది దర్శకుడి తప్పిదమా లేక వేరే వాళ్లదా అని పక్కన పెడితే.. సినిమా మొదలైన దగ్గర నుండి విడుదల అయ్యే వరకు ఓ హడావిడి చేసిన చిత్ర యూనిట్ ఫలితం చూశాకా ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యింది.
అయితే సినిమా జనాల్లోకి తీసుకెళ్లానే తాపత్రయంలో సినిమా చూస్తే 1 కెజి బంగారం గెలవొచ్చని పోటీ ఒకటి పెట్టారు సదరు సైజ్ జీరో దర్శక నిర్మాతలు. రిలీజ్ అయిన వారంలో ఈ పోటీ విజేతలను తెలుపుతాం అన్నారు. సినిమానే పోయే సరికి ఇక పోటీని కూడా గాలికొదిలేశారనుకుంటా అందుకే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. టికెట్ కొని సినిమా చూసి ఉచితంగా కెజి బంగారం కొట్టేయొచ్చని అనుకున్న వారందరికి సైజ్ జీరో సినిమా నిరాశే మిగిల్చింది.
ప్రస్తుతానికైతే సైజ్ జీరో బంగారం పోటీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి కార్పోరేట్ స్థాయి నుండి సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చిన పివిపి ఈ విషయాన్ని గమనించి బంగారం పొందిన వారిని ప్రకటిస్తాడా లేక ఇలానే జనాలు మర్చిపోయేదాకా గమ్మునుంటాడా అన్నది చూడాలి.