తెలుగు రాష్ట్రాల్లో సన్న బియ్యం కిలో రూ.60కిపైగా పలుకు తోంది. ఎన్నికల తరుణంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉపశమనం పేరుతో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో రూ.29కే కిలో చొప్పున అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నెల మొదటి వారం నుంచి మార్కెట్లో 10కిలోల చొప్పున సంచుల్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. గట్టిగా ప్రచారం కూడా చేశారు. కానీ వాస్తవ రూపంలో ఎక్కడా ఈ తరహా బియ్యం అమ్మకాలు కనిపించడం లేదు.
భారత్ బ్రాండ్ పేరిట విక్రయించే ఈ రైస్‌ను జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ( కేంద్రాలు, నాఫెడ్ ద్వారా విక్రయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడా అమ్మకాలు జరగడం ేదు. పత్రికలు, ప్రకటనల ద్వారా మాత్రమే రూ.29కే బియ్యం విక్రయిస్తున్నట్టు తెలిసిందని.. తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని అన్ని చోట్లా అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం పౌరసరఫరాల దుకాణాల్లో బియ్యంతో పాటు వివిధ రకాల సరుకుల విక్రయాలకు అనుమతిచ్చింది. కానీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.
తాజాగా భారత్ రైస్ అమ్మకాలపై కేంద్రం ప్రకటన చేయడంపై జనాలు ఎక్కడ అమలు జరుగుతున్నాయో తెలుసుకు నేందుకు ఆరా తీస్తున్నారు. ఆన్ లైన్ లోనూ అమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఎవరికైనా అందుబాటులోకి వస్తే.. అవి రేషన్ బియ్యమా.. సన్నబియ్యమా అన్న క్లారిటీ వస్తుంది. కానీ అమ్మకాలే కనిపించడం లేదు.