జగన్ రెడ్డి భజన మీడియాను టీడీపీ పెద్దలు ఎంత సహిద్దామన్నా సాధ్యం కాని పరిస్థితి ఆ మీడియా యాజమాన్యాలు కల్పిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేబుల్ ఆపరేటర్లు స్వచ్చందంగా టీవీ9, ఎన్టీవీ, సాక్షిలను నిలిపివేశారు. ఎందుకంటే అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం తమ వ్యతిరేక చానళ్లు అని ప్రకటించుకున్న వాటిని బెదిరించి మరీ నిలిపివేయించింది. ఈ విషయంలో టీడీపీ పెద్దలు జోక్యం చేసుకోలేదు.
అందుకే ఆ తర్వాత మెల్లగా సాక్షి మినహా ఇతర చానళ్లు లైవ్ లోకి వచ్చాయి. కానీ తాజాగా కేబుల్ ఆపరేటర్లు సాక్షితో పాటు ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలను నిలిపివేశారు. ఈ సారి టీడీపీ పెద్దలు ఆగ్రహం చేశారని భావిస్తున్నారు. ఈ రెండు చానళ్లు టీడీపీ నాయకత్వంపై ఐదేళ్ల పాట చల్లిన బురదకు.. ఆ రెండు చానళ్ల యాజమాన్యాలపై ప్రతీకారం తీర్చుకుంటే వారి వ్యాపారాలు నేలకు నాకాల్సి వస్తుంది. కానీ ప్రతీకార చర్యలకు చంద్రబాబు వ్యతిరేకం కాబట్టి సహనం పాటిస్తున్నారు. దీన్ని అలుసుగా చేసుకుంటున్నారు.
ఇటీవల వివాదాల్లో ఈ రెండు చానళ్లు వైసీపీ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. నిజాలను దాచి పెట్టే ప్రయత్నం చేశాయి. తప్పుడు ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి ఏఆర్ డెయిరీ పేరుతో మొత్తం దందా చేశారని ఆధారాలున్నా ఆయన చేసే రాజకీయానికే ప్రాధాన్యం ఇచ్చారు . ఇక ఎన్టీవీలో కీలక పొజిషన్లలో ఉన్న వారంతా టీడీపీ వ్యతిరేకులు. టీడీపీకి ,, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడుతూంటారు. కొత్తగా సాక్షి నుంచి సలహాదారుగా వెళ్లి ప్రభుత్వం మారడంతో నిరుద్యోగిగా మారిన నేమాని భాస్కర్ అనే వ్యక్తిని కూడా తీసుకుంటున్నారు. అంటే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదని … ఆ చానళ్లపై సహనం చూపిస్తే నష్టపోతామని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.