వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి..ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసిన తర్వాత ఇంట్లోనే రాజకీయం చేస్తున్నారు. అన్న పిలుపు అనే కార్యక్రమం పెట్టుకుని.. కొంత మందిని ఇంటికే పిలిపించి మాట్లాడటం ప్రారంభించారు. ఇలా తొలి రోజు.. ఓ 70 మందిని ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఈ మాటల సందర్భంలో.. ప్రత్యేకహోదా ఎలా తెస్తారని కొంత మంది ప్రశ్నించినప్పుడు… తనకు తెలిసిన.. తను చెబుతున్న మెకానిజాన్నే జగన్ వారికి చెప్పారు. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని బీజేపీ చెబుతున్నప్పుడు.. ఇక మిగిలింది కాంగ్రెస్ కాబట్టి.. ఆ పార్టీకి ఎందుకు మద్దతు ప్రకటించరని.. కొంత మంది తటస్థులు ప్రశ్నించారు. దానికి జగన్.. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశని.. అందువల్ల.. తను సాధించే ఎంపీ సీట్లే.. కీలకం అవుతాయని… ప్రత్యేకహోదా ఎవరు ఇస్తే వారికే మద్దతు ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.
అప్పుడే కొంత మందికి డౌట్ వచ్చింది. అసలు బీజేపీ ఇవ్వనే ఇవ్వనటోంది కదా.. అనేదే ఆ డౌట్.దానికి… కాంగ్రెస్ మాటలు నమ్మి ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటే నష్టపోతామని జగన్ కవర్ చేశారు. నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని వారికి జగన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి తటస్థులకు తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. బీజేపీతో తన బంధం గురించి తటస్థుల్లో అనుమానాలున్నాయి కాబట్టి.. వాటిని క్లారిఫై చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే.. కొంత మందికి లేఖలు కూడా రాస్తున్నారు.
లేఖల్లో .. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. తాను రాజీ పడబోనని చెప్పుకొస్తున్నారు. అంటే… ఎన్నికలు దగ్గర పడేకొద్దీ.. ఇప్పటి వరకూ.. తాను వ్యవహరించిన రాజకీయ విధానాల వల్ల.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న కారణంగా.. జగన్.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో జగన్ వాదనను తటస్తులు నమ్ముతారో లేదో మరి..!