మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్.. ఇలా ప్రచార పర్వానికి ఓ వరుస ఉంది. ఆడియోకి ముందు టీజర్, విడుదలకు ముందు ట్రైలర్ వదలడం ఓ ఆనవాయితీగా వస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ అనేది ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ సినిమాకి వెళ్లాలా? వద్దా? అనేది ట్రైలర్ చూసి డిసైడ్ అయిపోతున్నారు. అందుకే ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్రబృందం. అయితే ఈమధ్య థియేట్రికల్ ట్రైలర్ల్ని దాచి పెట్టి, హిట్లు కొడుతున్నారు సినిమావాళ్లు.
‘మహానటి’ థియేట్రికల్ ట్రైలర్ బయటకు రాలేదు. ‘గీతా గోవిందం’ దీ అదే పరిస్థితి. ఈ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. రెండూ సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ‘@నర్తనశాల’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయలేదు. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈనెల 30న విడుదల అవుతోంది. శుక్రవారం ప్రీ రిలీజ్‌ఫంక్షన్ జరిగింది. అప్పుడైనా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తారనుకున్నారు. కానీ.. నర్తనశాల టీమ్ షాక్ ఇచ్చింది. ట్రైలర్‌ని చూపించలేదు. సినిమా విడుదలయ్యాకే ట్రైలర్‌ని బయటకు వదులుతామని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ ఏర్పడింది. దాన్ని మరింత పెంచడం ఇష్టం లేక… ట్రైలర్‌ని విడుదల చేయలేదేమో..? లేదంటే ట్రైలర్లోనే అంతా చూపించేస్తే.. ఇక సినిమాలో చూపించడానికి ఏం ఉండదని… భావించి ఉంటారు. ఏది ఏమైనా ట్రైలర్ లేకుండానే సినిమాని రిలీజ్ చేయడం ఇప్పుడో సెంటిమెంట్‌గా మారిపోయింది. నర్తన శాల కూడా హిట్టయిపోతే.. ఇక మీదట ట్రైలర్లు లేకుండానే సినిమాలొచ్చేస్తాయి.