చిరంజీవి పుట్టిన రోజు హంగామా ఓ రేంజ్ లో జరిగింది. `భోళా శంకర్` టైటిల్, ఫస్ట్ లుక్, కీర్తి సురేష్ ఎంట్రీ గురించిన వార్తలు బయటకు వచ్చాయి. గాడ్ ఫాదర్ తోపాటుగా, బాబి సినిమాకి సంబంధించిన లుక్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమాకి `వీరయ్య` అనే టైటిల్ అనుకుంటున్నారు. అదెప్పుడు బయట పెడతారో చూడాలి. అయితే ఆచార్య నుంచి ఎలాంటి గిఫ్టులూ రాలేదు. ఆచార్య మేకింగ్ వీడియో అంటూ.. ఓ చిన్న వీడియో ఒకటి విడుదల చేశారు గానీ, అది పూర్తిగా చరణ్ కి సంబంధించిన పర్సనల్ ఇంట్రెస్ట్ తో బయటకు వచ్చింది. ఆచార్య నుంచి మరో టీజర్ వస్తుందని ఎదురు చూసిన అభిమానులు… `ఆచార్య` నుంచి ఎలాంటి హడావుడీ లేకపోవడంతో నిరాశ పడ్డారు. అయితే ఆచార్య కి సంబంధించిన చిన్న టీజర్ కూడా రెడీ అయ్యిందని, ఈ గుంపులో దాన్ని విడుదల చేయడం.. ఇష్టం లేక, హోల్డ్ చేశారని తెలుస్తోంది. ఈ వారాంతంలో దాన్ని బయటకు తీసే అవకాశం ఉంది.
చిరు పుట్టిన రోజున వచ్చిన లుక్లూ, ఇచ్చిన అప్ డేట్లలో అందరినీ ఇంప్రెస్ చేసింది మాత్రం బాబీ విడుదల చేసిన పోస్టరే. చిరుని మాస్ ఎలా చూడాలనుకుంటుందో అలాంటి.. స్టిల్ తో ఫస్ట్ లుక్ తోనే కేక పుట్టించారు. వేదాళం, లూసీఫర్ రెండూ రీమేక్ కథలే. కాబట్టి అందులో చిరంజీవి ఎలా కనిపించబోతున్నాడన్న విషయంలో అభిమానులకు ఓ అవగాహన ఉంటుంది. పైగా ఆ కథలూ తెలుసు. బాబీది మాత్రం పూర్తిగా కొత్త కథ. కాబట్టి.. అందులో చిరు ఎలా ఉంటాడన్న ఉత్సుకత మొదలైపోయింది.