టీవీ చానలా.. న్యూస్ పేపరా.. వెబ్ సైటా… యూట్యూబ్ చానలా.. చివరికి న్యూస్ ఏజెన్సీనా అన్నది పాయింట్ కాదు .. ప్రధాని మోదీ ఇంటర్యూ ఏదో ఓ మాధ్యమంలో రోజూ రావాల్సిందే. గత నెల రోజులుగా ఇదే తంతు. ఇప్పటికి మోదీ ఎనభై ఇంటర్యూలు ఇచ్చారు. ఇప్పటికీ రోజూ ఆయన చెప్పిందే చెప్పి. ఇంటర్యూలు ఇస్తూంటే..దాన్ని అందరూ కవర్ చేస్తూంటారు. చివరి విడతకు వచ్చే సరికి న్యూస్ ఎజెన్సీల దగ్గరకు చేరిపోయింది. ఇయాన్స్, ఏఎన్ఐ వంటి ఏజెన్సీలు ఇంటర్యూలు చేసి మరోసారి అన్ని చోట్లా మోడీ ఇంటర్యూలు వచ్చేలా చేసింది.
అడిగిన వారికి లేదనకుండా మోదీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో మాట్లాడారు. ప్రాంతీయ వార్తా ఛానెళ్ల ప్రతినిధులను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు. అదే సమయంలో మోడీ రోజువారీ ప్రచారానికి మీడియలో అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది. ఎక్కడ చూసినా మోడీనే కనిపిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష వాయిస్ కూడా వినిపించాలి. కానీ జాతీయ మీడియా అలాంటి రిజర్వేషన్లు పెట్టుకోవడం లేదు. ప్రతిపక్షం గురించి చెప్పాలనుకోవడం లేదు. రాహుల్ గాంధీ ఇంటర్యూను తీసుకునేందుకు.. ప్రసారం చేసేందుకు మీడియా ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకూ ఓ టీవీ చానల్ మాత్రమే రాహుల్ ను ఇంటర్యూ చేసింది. బహిరంగసభల్లో రాహుల్ ప్రచారానికి పెద్దగా స్పేస్ ఇవ్వడం లేదు. ఈ ఎన్నికల సీజన్ లో మీడియాలో పూర్తి స్థాయి బీజేపీ డామినేషన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమికి ప్రచారం చాలా స్వల్పంగా లభిస్తోంది.