అదే జగన్ రెడ్డి ఉంటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేదని జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మిగిలిపోయిన అరకొర మీడియా సోషల్ మీడియా బ్యాచ్ చెప్పుకుంటోంది. కానీ వారికి తెలిసినా చెప్పనిదేమిటంటే… జగన్ రెడ్డి ఓడిపోవడానికి ఆరేడు నెలల ముందే బటన్లు నొక్కి మరీ చేతులెత్తేశాడు. కనీసం పదివేలకోట్లు పంగనామాలు పెట్టారు. ఓటింగ్ ముందు రోజు అకౌంట్లలో వేస్తామని హంగామా చేశారు. కానీ డబ్బుల్లేవని తర్వాత తేలింది. ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే…లెక్కేలన్ని నిర్వాకాలు జగన్ రెడ్డి హయాంలో ఉన్నాయి.
కానీ ఇప్పుడు జగన్ ఉంటే డబ్బులొచ్చేవని ప్రచారం చేస్తున్నారు. ఆయన 2019లో అధికారం చేపట్టిన తర్వాత అమ్మఒడి ఇచ్చింది జనవరిలో .. ఏ పథకం అయినా నాలుగైదు నెలల తర్వాతనే ప్రారంభించారు. కానీ కక్ష సాధింపులు మాత్రం మొదటి రోజు నుంచే ప్రారంభించారు. అవ్వాతాతలకు చంద్రబాబు తొలి నెలలోనే ఏడు వేలు ఇచ్చాడు. జగన్ రెడ్డి రూ. రెండు వందలయాభై పెంచి.. రెండు వందల యాభై కోట్లను ప్రకటనల రూపంలో తన సాక్షి పత్రిక ఖాతాలో వేసుకున్నారు. ఇలాంటి నిర్వాకాలకు లెక్కే లేదు. బటన్లు నొక్కినట్లుగా ప్రకటనలు ఇచ్చుకున్న వాటికి డబ్బులు చెల్లించారు కానీ.. ఆ బటన్ల డబ్బులు మాత్రం లబ్దిదారుల ఖాతాల్లో పడలేదు.
Read Also : ఆర్కే పలుకు : జగన్ అంటే ఓ అదీ.. ఓ ఇదీ !
స్కీముల గురించి వైసీపీ నేతలు తర్వాత ఆరోపణలు చేయడానికి ఏమీ ఉండదని… అప్పుడే ఆరోపణలు ప్రారంభించారు. నెలన్నరకే కంగారు పడిపోతున్నారు. సూపర్ సిక్స్ అమలుపై స్పష్టమైన కార్యాచరణతోనే ప్రభుత్వం ఉంది. వైసీపీ నేతలు… ఆయా పథకాలు పెద్ద విషయమా అని.. తర్వాత చెప్పుకోవాల్సి ఉంటుంది. తాము చేసిన నిర్వకాలు బయటపడుతూంటే… జనానికి స్కీములు రాలేదని మొసలి కన్నీళ్లు కార్చేస్తున్నారు .